కేంద్ర ఆర్థికమంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న..ప‌లు గుడ్ న్యూస్‌లు

కేంద్ర ఆర్థికమంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న..ప‌లు గుడ్ న్యూస్‌లు

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గిస్తుంద‌నే ద‌శ‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న‌లు చేశారు. బ్యాంకుల‌కు సుమారు 70 వేల కోట్ల అద‌న‌పు నిధుల‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రెపో రేటుకు అనుగుణంగా గృహ‌, వాహ‌న రుణాల‌పై భారం త‌గ్గ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. స్టార్ట్ అప్స్‌, ఇన్వెస్ట‌ర్ల‌పై విధిస్తున్న ఏంజిల్ ట్యాక్స్‌ను ఉప‌సంహ‌రించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. 4 ల‌క్ష‌ల కోట్ల లిక్విడ్ క్యాష్‌ను మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు.ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసిన‌ట్లు ఆమె తెలిపారు. సూప‌ర్ రిచ్ ట్యాక్స్ నుంచి విదేశీ ఇన్వెస్ట‌ర్ల‌ను మిన‌హాయిస్తున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు.  

ప‌న్ను వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పుల‌కు త‌మ ప్ర‌భుత్వ శ్రీకారం చుట్టింద‌ని కేంద్ర‌మంత్రి తెలిపారు. ప‌న్ను వేధింపుల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఆమె ఖండించారు. ప‌న్ను ఎగ‌వేసిన వారిపై జ‌రిమానా విధిస్తున్నామ‌ని, కానీ వారిని కోర్టుకు ఈడ్చ‌డంలేద‌ని ఆమె అన్నారు. సంప‌ద‌ను సృష్టించేవాళ్ల‌ను ప్రోత్స‌హిస్తామ‌న్నారు. ఐటీ ఎగ‌వేత‌ల‌పై ఎవ‌రెవ‌రికి స‌మ‌న్లు ఇస్తున్నామ‌న్న విష‌యాన్ని ఇక నుంచి సెంట్ర‌లైజ్ చేయ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. స‌మ‌న్ల కోసం ఓ సెంట్ర‌లైజ్డ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. 14వేల ట్యాక్స్‌ కేసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. ఫారిన్ పాల‌సీ ఇన్వెస్ట్‌మెంట్‌(ఎఫ్‌పీఐ)ల‌పై స‌ర్‌చార్జీల‌ను ఎత్తివేసిన‌ట్లు ఆమె చెప్పారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స‌బులిటీ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌కున్నా.. దాన్ని క్రిమిన‌ల్ కేసుగా ప‌రిగ‌ణించ‌బోమ‌ని, వాటిని సివిల్ కేసులుగా ట్రీట్ చేయ‌నున్నారు.  14వేల ట్యాక్స్‌ కేసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

ఆర్థిక మంత్రి కీల‌క అంశాలు
* గృహ, వాహన ఈఎంఐలు తగ్గ‌డం
* రుణాల‌న్నింటిని రెపో రేటుకు అనుసంధానం
* బీఎస్ 4 కార్లు కొనసాగుతాయని ప్రకటన  
* 30రోజుల్లో మధ్యతరహా పరిశ్రమలకు జీఎస్టీ పెండింగ్ ఫండ్స్ క్లియర్
* స్టార్టప్ మీద ఎంజెల్ టాక్స్ రద్దు
* రేట్ల తగ్గింపు వినియోగదారులకు చెందేలా బ్యాంకు చర్యలు
* ఆటో సెక్టార్ కష్టాలు తొలగించడానికి చర్యలు
* బ్యాంకు రిక్యాపిటలైజేషన్‌కు 70వేల కోట్లు
* విదేశీ ఇన్వెస్టర్లకు కేవైసీ సరళీకరణ 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English