టీడీపీ రూట్‌ మారింది...టార్గెట్ కోడెల‌

టీడీపీ రూట్‌ మారింది...టార్గెట్ కోడెల‌


తెలుగుదేశం పార్టీ ప‌రువును గంగ‌పాలు చేయ‌డంతో పాటుగా పార్టీని అడ్డంగా బుక్ చేస్తున్న మాజీ స్పీక‌ర్, పార్టీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద్ రావు విష‌యంలో...టీడీపీ నేత‌లు ఇక ఉపేక్షించేది లేద‌నే స్థితికి చేరిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైన విషయంలో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పాత్ర తీవ్ర వివాదాస్ప‌దం అవుతుండ‌టంతో మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కంటే ఎండ‌గ‌ట్ట‌డమే స‌రైన విధాన‌మ‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కోడెల శివప్రసాద్ తన చర్యలతో పార్టీ పరువును రోడ్డున పడేశారని సాక్షాత్తు ఆ పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య మండిపడ్డారు.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో అసెంబ్లీ త‌ర‌లింపు సంద‌ర్భంగా సంబంధిత ఫర్నిచర్‌ను ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రదదారావు సొంత కార్యాలయంలో వాడుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కోడెల స్పందిస్తూ,  అసెంబ్లీ తనకు దేవాలయం లాంటిదని, ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో పూజారిలా పనిచేశానని చెప్పారు.  

ఎన్నో విషయాల్లో అందరికి మేలు చేశానని కానీ తనపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని కోడెల పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అసెంబ్లీని అమరావతికి తరలించిన సమయంలో కొంత ఫర్నిచర్‌ను గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంప్ ఆఫీసులకు తరలించారని అన్నారు. ఫర్నిచర్ తీసుకెళ్లాలని, లేదంటే దానికి తగిన డబ్బులు తీసుకెళ్లాలని కోడెల ఆఫ‌ర్ ఇచ్చారు.

ఇదిలాఉండ‌గా, ఫ‌ర్నీచ‌ర్ మాయం, కోడెల స్పంద‌న‌పై వ‌ర్ల రామ‌య్య ఘాటుగా స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన వర్ల రామ‌య్య కోడెల శివప్రసాద్ చర్యల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందని బహిరంగంగా వెల్లడించారు.

ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను కోడెల ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకోవడం అన్నది ముమ్మాటికీ తప్పేనని స్పష్టం చేశారు. ‘నాకు తెలిసినంతవరకూ కోడెల చేసింది తప్పే. ఆయనకు ఫర్నీచర్ కు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఇంటికి ఫర్నీచర్‌ను ఎలా తీసుకెళతారు? ఈ విషయం బయటకు వచ్చాక ‘ఇప్పుడు కావాలంటే తీసుకెళ్లండి’ అని కోడెల చెప్పడం కరెక్ట్ కాదు. కోడెల అలా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది. అసెంబ్లీ సిబ్బంది తీసుకెళ్లలేదు కాబట్టి సామగ్రిని నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పడం కూడా తప్పే. ఆయన అసెంబ్లీ కార్యదర్శికి చెప్పే తీసుకెళ్లారా ఫర్నీచర్ ను? లిస్ట్ ఇచ్చారా? అంటూ కోడెలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన తీరుతో తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English