ఎన్నికలు వస్తున్న వేళ.. ప్రపంచం మీద ట్రంప్ మార్క్ పెద్ద 'బాంబ్'

ఎన్నికలు వస్తున్న వేళ.. ప్రపంచం మీద ట్రంప్ మార్క్ పెద్ద 'బాంబ్'

ఒక్కో దేశానికి ఒక్కో మౌలిక స్వరూపం ఉంటుంది. రాజ్యాంగంలో ప్రాథమికంగా తనను తాను ఆవిష్కరించుకుంటుంది ప్రతి దేశం. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా విషయానికి వస్తే.. ప్రపంచంలోని ఏ జాతి జనులైనా ఫర్లేదు.. జస్ట్ టాలెంట్ ఉంటే చాలు అక్కున చేర్చుకుంటుంది.
అలాంటి దేశానికి ఉన్న మరో బ్యూటీ ఏమంటే.. ఆ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అమెరికన్ సిటిజన్ షిప్ బైడిపాల్ట్ అన్నట్లు వచ్చేస్తుంది. పుట్టటానికి ముందు వరకూ ఎక్కడున్నా?  ఆ బిడ్డ తల్లిదండ్రులు ఏ దేశస్తులు అన్న విషయాల్లోకి వెళ్లకుండా.. అమెరికా గడ్డ మీద పుడితే ప్రతి ఒక్కరూ అమెరికన్లే అనే మూల సిద్ధాంతం ఉంది.

వలసవాదులంటూ తమ దేశానికి వచ్చే వారిపై విషం కక్కే ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ కు ఇప్పుడా నిబంధన మీద కన్ను పడింది. ఛత్.. అమెరికా గడ్డ మీద పుడితే అమెరికన్ అవుతారా?  ఇదెక్కడి రూల్?  ఇంత కన్నా కామెడీ మరేమైనా ఉంటుందా?  సరిహద్దులు దాటేసి వచ్చి అమెరికాలో జన్మనిస్తే.. ఈ దేశ పౌరసత్వం రావటం ఏమిటి?  అస్సలు బాగోలేదీ చట్టం అంటూ తాజాగా అక్కసు వెళ్లగక్కారు ట్రంప్. జన్మత: పౌరసత్వం రద్దు చేసే విషయం మీద తాము ఆలోచిస్తున్నట్లుగా పేర్కొనటం ద్వారా ప్రపంచం మీద పెద్ద బాంబే వేశారు ట్రంప్.

చాలా దేశాల్లోని రాజ్యాంగాన్ని మార్చినంత ఈజీ కాదు అమెరికా రాజ్యాంగాన్ని మార్చటం. ప్రపంచంలో అత్యంత కష్టమైన.. క్లిష్టమైన రీతిలో అమెరికా రాజ్యాంగ సవరణ ఉంటుంది. నిత్యం అమెరికన్ వలసవాదుల మీద పడిపోతూ వారి మీద విరుచుకుపడే ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

ఇక్కడో విషయాన్ని చెప్పాలి. అసలు అమెరికాకు ఒక జాతి అంటూ లేదన్న వాదన ఉంది. ప్రపంచంలోని వివిధ జాతుల సమూహమే అమెరికన్ జాతిగా చెబుతారు. ఒకవేళ దాన్నే ప్రాతిపదికగా తీసుకున్నప్పడు అమెరికా మూలాల్ని సైతం ట్రంప్ విస్మరిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.

అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ ద్వారా వచ్చిన ఈ హక్కు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. దాన్ని రద్దు చేయాలన్న అంశం మీద పట్టుదలతో ఉన్నారు ట్రంప్. మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న వేళ.. తన ట్రేడ్ మార్క్ అయిన వలసల మీద విరుచుకుపడే విధానపు కత్తిని మరింత నూరి.. తన మాదిరి ఆలోచించే అమెరికన్లను కూడగట్టటం.. వారి బలంతో అమెరికా అధ్యక్షుడిగా మరోమారు అధికారాన్ని చేపట్టాలనుకుంటున్న ట్రంప్ ప్లాన్ ఎంతవరకూ వర్క్ వుట్ అవుతుందో కాలమే క్లారిటీ ఇవ్వగలదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English