తుగ్లక్‌లా మారొద్దు... జగన్‌కు నాని సలహా

తుగ్లక్‌లా మారొద్దు... జగన్‌కు నాని సలహా

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్‌ చేశారు. చిన్నప్పుడు మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ చరిత్రను పుస్తకాల్లో చదివాం జగన్‌ గారు.. మీరు అలా కావొద్దు అని ఆయన అన్నారు. దిల్లీ నుంచి రాజధానిని దౌలతాబాద్‌కు మార్చేసి ఆ తర్వాత మళ్లి తుగ్లక్‌ దిల్లికి రాజధానిని మార్చారన్నారు. జగన్‌ తుగ్లక్‌లాగా చరిత్రకు ఎక్కకూడదని భగవంతుడిని కోరుకుంటున్నానని నాని ట్వీట్ చేశారు.

అమరావతి రాజధానిపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కేశినేని నాని ఇలాంటి వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా  చేసినట్లు తెలుస్తోంది. రాజధాని తరలిపోతుంది, వైసీపీ రాజధానిని వేరో ప్రాంతానికి తరలించబోతుంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కేశినేని నాని రాజధాని మార్చొద్దంటూ పరోక్షంగా సూచించారు.

చిన్నపుడు మొహ్మద్ బీన్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాము 1328 సంవత్సరంలో ఢిల్లీ నుంచి రాజధాని మహారాష్ట్ర లోని దౌలతాబాద్కు తిరిగి అక్కడి నుండి ఢిల్లీ కి మార్చిన వైనం. మీరు ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని  భగవంతుని కోరుకుంటున్నాను అంటూ ఆయన సీరియస్ వ్యాఖ్యలే చేశారు.

కాగా రాజధాని తరలింపుపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేయడం.. మోదీ ఆశీస్సులతోనే అన్నీ చేస్తున్నామని విజయసాయిరెడ్డి కూడా అనడంతో అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందన్న ప్రచారం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో అక్కడ ఇప్పటికే తగ్గిన భూముల ధరలు మరింత తగ్గాయి. మరోవైపు దొనకొండకు రాజధాని మారుతుందన్న ప్రచారం జరుగుతుండడంతో అక్కడ భూముల ధరలు ఒక్కసారిగా నాలుగైదు రెట్లు పెరిగినట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English