ఏపీకి అమ‌రావ‌తి, దొన‌కొండ కాదు... తెర‌పైకి మూడో రాజ‌ధాని..!

ఏపీకి అమ‌రావ‌తి, దొన‌కొండ కాదు... తెర‌పైకి మూడో రాజ‌ధాని..!

ఏపీలో నిన్న మొన్నటి వరకు వరద రాజకీయాలపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న అధికార వైసిపి విపక్ష టిడిపి నేతల మధ్య ఇప్పుడు ఏపీ రాజధాని మార్పు వ్యవహారం ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. ప్ర‌స్తుతం ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ఇదే అంశం బాగా ట్రెండ్ అవుతుంది.

వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని నుంచి తప్పించి చేసి ప్రకాశం జిల్లాలోని దొనకొండను రాజధానిగా చేస్తారంటూ టిడిపి వర్గాలు ప్రచారం చేశాయి. ఈ ప్రచారం వైసీపీకి మైనస్ గా ఉండడంతో వైసీపీ నేతలు రాజధానిగా అమరావతి ఉంటుందని టిడిపి వాళ్ళకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తాజా ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండున్నర నెలలు అవుతున్నా రాజధాని విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయనిరాకరణ ఉండటం ప్రధాన సమస్యగా మారింది.

ఈ క్రమంలోనే జగన్ పాలనాపరంగా మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు కదులుతున్నారు. ప్రస్తుతం రాజధానిలో నిర్మాణాలు ఆగడంతో కొంతమందికి రాజధాని మార్పు పై సందేహాలు నెలకొన్న మాట వాస్తవమే.

ఇక సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సైతం రాజ‌ధాని మార్పు విష‌యంలో లేనిపోని సందేహాలు క‌లిగేలా మాట్లాడ‌డంతో ఏపీ రాజ‌ధాని దొనకొండ అయిపోతుందంటూ రెండు రోజులుగా మీడియాలోనూ, సోష‌ల్ మీడియా వ‌ర్గాల్లోనూ ఒక్క‌టే వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

దీనిపై ఎక్క‌డిక‌క్క‌డ చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేయాలంటే నిర్మాణ వ్య‌యం డ‌బుల్ అవుతుంద‌ని.. ఈ విష‌యంలో త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బొత్స చెప్పిన సంగ‌తి తెలిసిందే.

రాజ‌ధానిని వైసీపీ ప్ర‌భుత్వం మారుస్తుంద‌ని బొత్స చెప్పక‌పోయినా ఆయ‌న అనుమానం క‌లిగేలా మాట్లాడ‌డంతోనే అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది. ఈ ర‌చ్చ ఇలా ఉండ‌గానే అమ‌రావ‌తి, దొన‌కొండ కాకుండా ప్ర‌ముఖ ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుప‌తిని ఏపీ రాజ‌ధానిగా చేయాల‌న్న నినాదాలు వ‌స్తున్నాయి. ఏపీ రాజధానిగా తిరుపతి చేయాలని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. రాజధానిగా దొనకొండ కంటే తిరుపతి బాగుంటుందని మోహ‌న్ చెప్పారు.

దొన‌కొండ‌లో రాజ‌ధాని ఏర్పాటుకు స‌రైన వ‌స‌తులు లేవ‌న్న ఆయ‌న‌... రాజ‌ధాని ఏర్పాటుకు అన్ని విధాలా తిరుప‌తే క‌రెక్ట్ అని చెప్పారు. ఇక రాజ‌ధాని చాలా సునిశిత‌మైన అంశం కావ‌డంతో ఈ విష‌యంలో జ‌గ‌న్ ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా చెప్పారు. ఏదేమైనా ఏపీ రాజ‌ధాని విష‌యంలో ఇప్పుడు మూడో పేరు కూడా తెర‌మీద‌కు రావ‌డంతో రాజ‌ధాని ర‌చ్చ ఇప్ప‌ట్లో ఆగేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English