వైసీపీని అడ్డంగా ఇరికించిన ఏపీ మంత్రి

వైసీపీని అడ్డంగా ఇరికించిన ఏపీ మంత్రి

ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అధికార వైసీపీని అడ్డంగా ఇరికించేశారా..?  మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ల‌స్ అయ్యేలా మాట్లాడారా..? అంటే ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న టాక్ మాత్రం ఔన‌నే అంటోంది. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. వైసీపీ నేత‌లు టీడీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో అవినీతి ఆరోఫ‌ణ‌లు గుప్పించారు. అందులో ప్ర‌ధాన‌మైన‌ది రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు దోచుకుంటున్నార‌ని, స‌చివాల‌యం, అసెంబ్లీ నిర్మాణాల వ్య‌యాన్ని అడ్డ‌గోలుగా పెంచేసి, అందిన‌కాడికి దండుకుంటున్నార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ విరుచుప‌డ్డారు అప్ప‌ట్లో..!

అయితే.. అదే బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ల‌స్ అయ్యేలా ఉండడం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం నాడు ఆయ‌న మాట్లాడుతూ.. అమ‌రావ‌తి నిర్మాణ వ్య‌యం ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చుకుంటే.. చాలా ఎక్కువ‌గా ఉంద‌ని సెల‌విచ్చారు. అంటే.. ఆనాడు చంద్ర‌బాబు నిర్మాణ వ్య‌యం పెంచ‌డంలో త‌ప్పేమీ లేద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇప్పుడు స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

ప్ర‌తిప‌క్షం ఉండ‌గా.. వైసీపీ నేత‌లు చేసిన విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు అన్నీ త‌ప్పేన‌ని బొత్స ఒప్పుకున్నార‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. బొత్స వ్యాఖ్య‌లు అధికార వైసీపీకి తీవ్ర త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. ఇదే అద‌నుగా తీసుకుని టీడీపీ నేత‌లు రెచ్చిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. అమ‌రావ‌తి నిర్మాణం చాలా ఎక్కువ‌గా ఉంద‌న్న కార‌ణంతో రాజ‌ధాని అమ‌రావ‌తిని ఇక్క‌డి నుంచి త‌ర‌లిస్తారా..? అనే అనుమానాలుకూడా ప్ర‌జ‌ల్లో క‌లుగుతున్నాయి.

బొత్స మాట‌ల్లో ఇదే అంత‌రార్థం కావొచ్చున‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నేత‌లు కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌యోగించారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే.. అమ‌రావ‌తిని ఇక్క‌డి నుంచి త‌ర‌లిస్తారంటూ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే.. దీనిని వైసీపీ నేత‌లు కూడా గ‌ట్టిగానే తిప్పికొట్టారు. ఏది ఏమైనా.. బొత్స మాట‌లు మాత్రం అధికార వైసీపీని ఇర‌కాటంలో ప‌డేశాయి. దీనిని మ‌రి ఎలా ?అధిగ‌మిస్తారో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English