బికినీ ఎయిర్‌లెన్స్ బంప‌ర్ ఆఫ‌ర్‌... రూ.9 కే టిక్కెట్‌

బికినీ ఎయిర్‌లెన్స్ బంప‌ర్ ఆఫ‌ర్‌... రూ.9 కే టిక్కెట్‌

విమాన‌రంగంలో కొత్త సంస్థ‌ల ఎంట్రీతో ఆఫ‌ర్లు అదిరిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే వియత్నాంకు చెందిన వియత్‌ జెట్‌ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే  ప్రారంభం కానున్నాయి. ఈ సంస్థ వియ‌త్నాం - ఇండియా మ‌ధ్య డిసెంబ‌ర్ నుంచి ప్ర‌త్య‌క్ష విమానయాన సేవ‌ల‌ను ప్రారంభించ‌నుంది. ఈ విష‌యాన్ని ఈ సంస్థ అధికారికంగా వెల్ల‌డించింది.

ఈ రెండు దేశాల మ‌ధ్య బికినీ ఎయిర్‌లైన్స్ ప్రారంభించే తొలి స‌ర్వీసు డిసెంబర్ 6న ప్రారంభం కానుంది.  న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను న‌డ‌ప‌నున్నారు. అలాగే వియ‌త్నాంలోని హ‌నోయి - ఢిల్లీ మార్గంలో డిసెంబ‌ర్ 7 నుంచి స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయి. ఆ రోజు నుంచి వారంలో మూడు రిట‌ర్న్ విమానాలను నడుపుతారు.

అదిరిపోయే ఆఫ‌ర్‌... టిక్కెట్ రేటు రూ.9 :
వియ‌త్నాం - ఢిల్లీ మ‌ధ్య ఫ్లైట్లు న‌డ‌ప‌డ‌మే ప్ర‌యాణికుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ అనుకుంటే... ఈ సంస్థ మ‌రో అదిరిపోయే బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ప్ర‌క‌టించింది.  త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోన్న త‌మ నెట్ వ‌ర్క్‌లో భార‌త్ భాగ‌స్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉంద‌ని ఈ సంస్థ ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు.

బికినీ పేరెందుకు వ‌చ్చిందంటే...
ఈ వియ‌త్ జెట్ 2011 డిసెంబ‌ర్ నుంచి సేవ‌లు అందిస్తోంది. ఇక ఈ సంస్థ‌కు బికినీ ఎయిర్‌లైన్స్ అన్న పేరు రావ‌డం వెన‌క ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ కూడా ఉంది. ఈ సంస్థ‌కు చెందిన కొన్ని విమానాల్లో ప‌నిచేసే సిబ్బంది బికినీలు ధ‌రించే ఉంటారు. ఈ సంస్థ ప్ర‌తి యేటా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రిలీజ్ చేసే క్యాలెండ‌ర్ల‌లో అమ్మాయిల ఫొటోలు కూడా బికినీల‌తోనే ద‌ర్శ‌న‌మిస్తాయి.

 చైనాలో జరిగిన ఆసియా కప్‌పోటీలకు వియత్నాం అండర్ -23 ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో బికినీలు ధరించిన మోడల్స్‌  ఉండ‌డం అప్ప‌ట్లో వివాదం అయ్యింది. ఈ నేప‌థ్యంలోనే వియ‌త్ జెట్‌కు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వియత్నాం (సిఎవి) జరిమానా  కూడా విధించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English