జ‌గ‌న్ సెల్ఫ్‌గోల్‌..మోదీ స‌న్నిహితుడి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ

జ‌గ‌న్ సెల్ఫ్‌గోల్‌..మోదీ స‌న్నిహితుడి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ గ్రూప్‌ను తప్పించిన ఎపిసోడ్‌లో ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి షాకుల పరంప‌ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఈ నిర్ణ‌యంపై రాజ‌కీయ‌ప‌ర‌మైన, కేంద్ర ప్ర‌భుత్వం ప‌రంగా ఎదురుదాడి వంటివి కొన‌సాగుతుండ‌గానే... న‌వ‌యుగ గ్రూప్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితులైన అదాని గ్రూప్‌ ఎండీ గౌతమ్‌తో చర్చలు జరిపి కృష్ణ పట్నం పోర్టులో ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. జ‌గ‌న్‌కు త‌మ రాజ‌కీయ స‌త్తాను చాటిచెప్పేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మ‌చారం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న నవయుగను ఆ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. అందుకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

అయితే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కక్ష సాధింపులో భాగంగా జగన్‌ సర్కార్‌ నవయుగను తొలగించిందో...లేక పోలవరం పనుల్లో నిజంగానే అక్రమాలు జరిగాయని కాంట్రాక్ట్‌ బాధ్యతల నుంచి తప్పించారో ఏమో తెలియదుకాని అప్పట్నుంచి నవయుగ సంస్థ రాష్ట్రంలోని తమ వ్యాపార సంస్థ లను కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలున్న గ్రూప్‌లకు భాగస్వామ్యం కల్పించాలన్న యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో  నవయుగ గ్రూప్‌ ఛైర్మన్‌ చింతా విశ్వేశ్వరరావు (సీవీఆర్‌) అదాని గ్రూప్‌ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న అదాని గ్రూప్‌తో చేతులు కలపడం ద్వారా రాష్ట్రంలోని తమ వ్యాపార సంస్థ లకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్న ఆలోచనతో ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల స‌మాచారం.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవును హైదరాబాద్‌కు చెందిన నవయుగ గ్రూపు ఏర్పాటు చేసి, నిర్వహిస్తోంది. 2008లో ప్రారంభమైన ఈ కేపీసీఎల్..6800 ఎకరాల విస్త్రీర్ణంలో ఏర్పాటైంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 41 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి అయింది. ఈ పోర్ట్‌పై గౌతమ్ అదానీ కన్ను కృష్ణపట్నం పోర్టుపై పడింది.

కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్(కేపీసీఎల్)లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు అదానీ గ్రూపు-న‌వ‌యుగ మ‌ధ్య చ‌ర్చ‌లు జరిగినట్లు స‌మాచారం. . కేపీసీఎల్‌లలో 72 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూపు ఆసక్తి చూపినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న కంపెనీ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఒప్పందం విలువ రూ.5,500 కోట్ల స్థాయిలో ఉంటుందని ప్రాథమిక అంచనా. త్వ‌ర‌లో ఈ ఒప్పందంపై పూర్తి స్ప‌ష్ట‌త‌, అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English