సీఎం మేనల్లుడ్ని అరెస్ట్ చేసిన ఈడీ

సీఎం మేనల్లుడ్ని అరెస్ట్ చేసిన ఈడీ

ఒకప్పుడు అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని అరెస్ట్ చేయటానికి అదో పెద్ద ప్రాసెస్ లా ఉండేది. మోడీ హయాంలో అలాంటి హద్దులన్ని చెరిగిపోయాయి. సీబీఐ.. ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు మస్తు పవర్ ఫుల్ గా మారిపోవటమే కాదు.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆ మధ్యన సీఎం ఇంట్లోకి వెళ్లిపోయి మరీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించటం.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆఫీసులోనూ తనిఖీలు జరపటం లాంటి సిత్రాలెన్నో చూసినవే.

ఇప్పుడా వరుస క్రమంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. తాజాగా కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పురిని అరెస్ట్ చేశారు. ఆయనపై వందల కోట్ల మేర బ్యాంకును మోసం చేసిన నేరారోపణలు ఉన్నాయి.

మోసర్ బేర్ కంపెనీకి సీనియర్ ఎగ్జిక్యుటివ్ గా ఉన్న సమయంలో రతుల్ పురి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రతుల్ పురితో పాటు మోసర్ బేర్ కు చెందిన మరో నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రతుల్ పురిపైన రూ.354 కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలు ఉండేవి.

సీడీలు.. డీవీడీలు.. స్టోరేజ్ డివైజ్ ల్ని తయారు చేసే ఈ కంపెనీ అగస్టా వెస్ట్ ల్యాంక్ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మైఖేల్ ముడుపులకు సంబంధించిన నగదు చేతులు మారినట్లుగా విమర్శలు ఉన్నాయి. ఈ అంశంపై విచారణ జరుపుతున్న సీబీఐ.. ఈడీలు తాజాగా సీఎం మేనల్లుడ్ని అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English