బీహార్ లో ఆస్పత్రి పాలైన నరసింహన్

బీహార్ లో ఆస్పత్రి పాలైన నరసింహన్

మొన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగి ప్రస్తుతం తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. తెలంగాణ నుంచి బీహార్ వెళ్లిన సందర్భంగా నరసింహన్ కు ఒక్కసారిగా వాంతులు కావడం సంచలనం రేకెత్తించింది. గవర్నర్ వెంట ఉన్న అధికారులను పరుగులు పెట్టించింది. పూర్వాశ్రమంలో సత్తా కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరుగాంచిన నరసింహన్... తెలుగు నేలకు వచ్చిన తర్వాత చాలా ఆరోగ్యంగా, చలాకీగా, అందరినీ నవ్విస్తూ, యమా యాక్టివ్ గా కనిపించే గవర్నర్ కు అనారోగ్యం అన్న మాట విన్నంతనే అంతా హడలిపోయారు.

తన సతీమణి విమలతో కలిసి బీహార్ లోని గయకు వెళ్లిన గవర్నర్ ఆ పర్యటనలో ఉండగానే అనారోగ్యానికి గురయ్యారు. బాగానే ఉన్నట్టుగా కనిపించిన నరసింహన్ కు ఉన్నపళంగా వాంతులు అయ్యాయట. దీంతో పరుగులు పెట్టిన అధికారులు ఆయనను గయలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు నరసింహన్ ను పరిశీలించి... పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, చిన్న అజీర్తి వల్లే ఆయనకు వాంతులు అయ్యాయని తేల్చారట. వాంతులతో కాస్తంత భయానికి గురైన నరసింహన్ కూడా వైద్యుల మాటతో కాస్తంత కుదుటపడ్డారట. వాంతులతో కాసేపు ఇబ్బంది పడిన నరసింహన్... కాసేపు విశ్రాంతి తీసుకుని అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారట.

ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగినంత కాలం చాలా యాక్టివ్ గా కనిపించిన నరసింహన్... ఏపీ బాధ్యతల నుంచి ఉపశమనం లభించిన తర్వాత కాస్తంత స్తబ్దుగానే కనిపిస్తున్నారన్న వాదన లేకపోలేదు. ఈ క్రమంలోనే ఆయన ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉండగా వాంతులు చేసుకోవడం ఆసక్తిగా మారింది. దేశంలో సుదీర్ఘ కాలం పాటు గవర్నర్ గా కొనసాగిన వ్యక్తుల్లో తొలి వరుసలోనే ఉన్న గవర్నర్ మరింత కాలం పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు వాంతులు కావడం, హుటాహుటీన ఆసుపత్రికి వెళ్లడం కాస్తంత ఆందోళన కలిగించేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English