మ‌ళ్లీ గెలుపు జ‌గ‌న్‌, కేసీఆర్‌దే... క్లీన్‌స్వీప్‌

మ‌ళ్లీ గెలుపు జ‌గ‌న్‌, కేసీఆర్‌దే... క్లీన్‌స్వీప్‌

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యాల‌తో సీఎంలు అయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మ‌రోసారి గెలుపును త‌మ ఖాతాలోనే వేసుకున్నారు. ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక, తెలంగాణ‌లో ఓ ఎమ్మెల్సీ ఎన్నిక‌ ఏకగ్రీమయ్యాయి. ఏపీ విష‌యానికి వ‌స్తే ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు వైసీపీ నుంచి రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

అసెంబ్లీలో వైసీపీ బ‌లం ఏకంగా 151 ఉండ‌డంతో టీడీపీ క‌నీసం అభ్య‌ర్థిని పోటీ పెట్టేందుకు కూడా సాహ‌సించ‌లేదు. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి సోమవారం ప్రకటించారు. జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల్లో చాలా మంది ఆశావాహులు ఉన్నా సామాజిక స‌మ‌తుల్య‌త‌ను బేరీజు వేసుకుని బీసీ కోటాలో మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, మైనార్టీ కోతాలో మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌, రెడ్డి కోటాలో చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డికి అవ‌కాశం ఇచ్చారు.

మిగిలిన ఆశావాహుల‌కు, సీనియ‌ర్ల‌కు మ‌లి విడ‌త‌లో చోటు క‌ల్పించ‌నున్న‌ట్టు స‌మాచారం. రెండున్న‌రేళ్ల త‌ర్వాత జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో మార్పులు, చేర్పులు చేస్తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే మంత్రి ప‌ద‌విపై హామీ ఇచ్చిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్ల‌కు మ‌లి విడ‌త‌లోనే ఎమ్మెల్సీ అవ‌కాశం ఉందంటున్నారు. ఇక తెలంగాణ‌లో ఏకైక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి కైవ‌సం చేసుకున్నారు.

ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డికి కేసీఆర్ త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తార‌న్న ప్ర‌చారం కూడా టీ పాలిటిక్స్‌లో జ‌రుగుతోంది. గుత్తాను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాల‌న్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఆయ‌న‌కు ఎంపీ సీటు ఇవ్వ‌లేదు. గ‌త కేబినెట్‌లోనే ఆయ‌న‌కు చోటు ద‌క్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నా కొన్ని ఈక్వేష‌న్ల వ‌ల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు కేసీఆర్ రెండో కేబినెట్‌లో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌నుంది. ఏదేమైనా కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ ఎమ్మెల్సీల‌ను క్వీన్‌స్వీప్ చేసేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English