ఊరిస్తున్న కేసీఆర్‌... ఎదురుచూస్తున్న సీనియ‌ర్లు

ఊరిస్తున్న కేసీఆర్‌... ఎదురుచూస్తున్న సీనియ‌ర్లు

ఏకచ‌త్రాధిప‌త్యంగా సాగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ తీరుపై ఆ పార్టీ నేత‌ల్లో అసంతృప్తి పెరుగుతోంద‌ని అంటున్నారు. త‌మ ఆకాంక్ష‌ల, సీనియారిటీని నాయ‌కుడు లైట్ తీసుకోవ‌డాన్ని స‌హించ‌లేక‌పోతున్నారని చ‌ర్చ జ‌రుగుతోంది ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు ఏడాదిగా గులాబీ పార్టీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారని తెలుస్తోంది.

ఇటు టీఆర్ఎస్ పార్టీ క‌మిటీలు, అటు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌డం విష‌యంలో లీకులతోనే స‌రిపెడుతుండ‌డటం...అదే స‌మ‌యంలో తాజాగా త‌న మ‌నిషికి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

తాజాగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ స్వయంగా వినోద్‌కుమార్‌కు ప్రగతిభవన్‌లో నియామక ఉత్తర్వులను అందజేశారు. వినోద్‌కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్ క్యాబినెట్ హోదా కలిగి ఉండటంతోపాటు రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు.

కాగా, ఇటు పార్టీ ప‌ద‌వులు అటు నామినేటెడ్ ప‌ద‌వుల కోసం నేత‌లు నిరీక్షిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాక ఇప్పటివరకు ప్రతీసారి టీఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మాత్రమే జరిగింది. కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే, జిల్లాల క‌మిటీలు మాత్రం వేయ‌లేదు.

జిల్లాల విభజన కాకముందు పాత జిల్లాల్లో కమిటీలు వేసినా, ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కమిటీలు నియామకం జరగలేదని ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న జిల్లాలు కావడంతో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్‌ నేతలు సుముఖత చూపలేదు. అందులో కొంతమందికి నామినేటెడ్‌ పదవులు వరించగా, వాటికోసం మరికొందరు ఎదురుచూస్తున్నారు.

నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం రానివారికి పార్టీ పదవుల్లో అవకాశం కల్పిస్తానని కేసీఆర్‌ నేతలకు ఆశ కల్పించారు. టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సహ మరికొన్ని పార్టీల నుంచి కొంతమంది నేతలు టీఆర్‌ఎస్‌పార్టీలో చేరారు. నేతలు ఎక్కువమంది కావడంతో తమ నిర్మాణం కూడా నిర్మాణం కూడా అటకెక్కింది అని సీనియర్లు అభిప్రాయపడ్డారు.

అటు పదవులు కల్పించకుండా, ఇటు పార్టీ బాధ్యతలు ఇవ్వకుండా తాము ఏమి చేయాలని అడుగుతున్నారు. నియోజకవర్గ జాబితాలు సిద్ధంగానే ఉన్నాయని, రాష్ట్ర కార్యవర్గం కూర్పు జరగాల్సి ఉందని, పైగా ముహూర్తం కోసం కేసీఆర్‌ చూస్తున్నారని పార్టీలోని కేసీఆర్ స‌న్నిహిత‌వ‌ర్గాలు అంటున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English