బాబు ఇక‌, ఖాళీ చేయ‌క‌త‌ప్ప‌దా... మ‌రోసారి నోటీసులు

బాబు ఇక‌, ఖాళీ చేయ‌క‌త‌ప్ప‌దా... మ‌రోసారి నోటీసులు

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి మాదిరిగా ప‌రిస్థితి మారిపోయింది. కృష్ణాన దీ గ‌ర్భంలో లింగ‌మ‌నేని ఎస్టేట్స్ నిర్మించిన ఓ భ‌వ‌నంలో ఆయ‌న గ‌డిచిన ఐదేళ్లుగా నివాసం ఉంటున్నారు . అయితే, ఇది అక్ర‌మ క‌ట్ట‌డ‌మ‌ని, న‌దీ ప‌రివాహ‌క చ‌ట్టాల‌ను ఉల్లంఘించి దీనిని నిర్మించార‌ని ఆరోపిస్తూ.. వ‌చ్చిన జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం కొన్ని రోజుల కింద‌ట నోటీసులు కూడా జారీ చేసింది. అయితే,దీనిని స‌వాలుగా తీసుకున్న చంద్ర‌బాబు, లింగ‌మ‌నేని ఎస్టేట్ సంస్థ కోర్టుకు వెళ్లి నోటీసుల‌పై మ‌ధ్యంత‌ర ఆర్డ‌ర్ పొందాయి.

అదే స‌మ‌యంలో తాను ఖాళీ చేసేది లేద‌ని, అవ‌స‌ర‌మైతే.. ఫుట్ పాత్‌పై ప‌డుకుంటాన‌ని అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దీంతో ఇది బాబుకు, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఎడ‌తెగ‌ని స‌మ‌స్య‌గా మారిపోయింది. ఇంత‌లోనే ఎగువ రాష్ట్రా ల్లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా కృష్ణాన‌దికి వ‌ర‌ద పోటెత్తింది. దీంతో గ‌డిచిన కొన్ని రోజులుగా విజ‌యవాడలోని ప్ర‌కాశం బ్యారీజీకి కృష్ణ‌మ్మ పోటెత్తుతోంది. దీంతో న‌దికి ఆనుకుని నిర్మించిన బాబు నివాసం కూ డా నీట మునిగే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌భుత్వం రెండు రోజులుగా హెచ్చ‌రిస్తోంది.

ఈ క్ర‌మంలోనే అక్క‌డి ప‌రి స్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ డ్రోన్ల‌ను పంపి ప‌రిశీల‌న చేయ‌డం, ఇది రాజ‌కీయంగా వివాదం సృష్టించ‌డం తెలిసిందే. అయితే, తాజాగా న‌దీ ప్ర‌వాహం మ‌రింత పెర‌గ‌డంతో బాబు నివాసంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నీట మునిగింది. దీంతో మ‌రోసారి ప్ర‌భుత్వం ఇల్లు ఖాళీ చేయాలంటూ.. బాబుకు నోటీ సులు జారీచేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు నిబంధ‌న‌ల వంక‌తో ఖాళీ చేసేందుకు స‌సేమిరా అన్న చంద్ర‌బాబు ఇప్పు డు హెలీప్యాడ్ కూడా మునిగిపోవ‌డం, ప్ర‌బుత్వం మ‌రోసారి నోటీసులు జారీ చేయ‌డంతో ఖాళీ చేయ‌క‌త ప్పని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

కృష్ణా నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున.. తక్షణమే ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చేందుకు ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. ఇప్పటికే 32 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీని పైన టీడీపీ నేతలు అధికారికంగా స్పందించలేదు. అయితే, ప్రస్తుతం ఆ నివాసంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English