వైఎస్ జగన్ పాలనపై ప్రభాస్ కామెంట్

వైఎస్ జగన్ పాలనపై ప్రభాస్ కామెంట్

టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలు రాజకీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తారు. ఎవరి గురించీ పాజిటివ్‌గా కానీ, నెగెటివ్‌గా కానీ మాట్లాడి తమ మీద ఒక ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇలాగే ఉంటాడు. ఎప్పుడూ పొలిటికల్ కామెంట్లు చేయడు. ఐతే ‘సాహో’ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అతడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందన్న ప్రశ్న ఎదురైంది.

కాస్త ఇబ్బంది పడుతూనే డిప్లమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు ప్రభాస్. తనకు రాజకీయాలు పెద్దగా తెలియవన్న ప్రభాస్.. జగన్ పాలన ఇప్పుడే మొదలైందని.. అతను బాగానే పరిపాలిస్తున్నాడనిపిస్తోందని అన్నాడు. జగన్ యంగ్ సీఎం అని.. కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాగా పాలిస్తాడని ఆశించవచ్చని.. ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు ప్రభాస్. మొత్తానికి జగన్ గురించి ప్రభాస్ పాజిటివ్ కామెంటే చేశాడని చెప్పాలి.

ఇక టాలీవుడ్ హీరోలతో తన సంబంధాల గురించి కూడా ప్రభాస్ మాట్లాడాడు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో తనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని ప్రభాస్ చెప్పాడు. వీళ్లు ముందు నుంచి తనకు క్లోజ్ అన్నాడు. రామ్ చరణ్‌తో తనకు చనువు తక్కువే అని.. ఐతే ‘యువి క్రియేషన్స్’ అధినేతల్లో ఒకడు, తన మిత్రుడు అయిన విక్కీకి చరణ్ బాగా క్లోజ్ అని చెప్పాడు ప్రభాస్.

రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి సందర్భంగా చరణ్‌తో తనకు చనువు పెరిగిందని.. భవిష్యత్తులో తామిద్దరం ఇంకా క్లోజ్ అవుతామనుకుంటున్నట్లు చెప్పాడు ప్రభాస్. రిజర్వ్డ్‌గా ఉండే ప్రభాస్‌కు టాలీవుడ్లో పరిమిత సంఖ్యలోనే స్నేహితులున్నారు. కానీ ఆ కొద్దిమందితో చాలా క్లోజ్‌గా ఉంటాడని పేరుంది. సినిమా వాళ్లతో కంటే తన చిన్ననాటి మిత్రులతోనే ప్రభాస్ బాగా క్లోజ్ అని కూడా చెబుతారు. వాళ్లతో అప్పుడప్పుడూ అతను ఫారిన్ టూర్లకు వెళ్తుంటాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English