గ్రీన్‌లాండ్‌ను కొనేస్తానంటున్న ట్రంప్

గ్రీన్‌లాండ్‌ను కొనేస్తానంటున్న ట్రంప్

యుద్ధం చేసి ఆక్రమించుకోవడమో, లేదంటే అంతర్గత కల్లోలం సృష్టించి పెత్తనమంతా తన చేతికి తెచ్చుకోవడమో కాదు... ఏకంగా ఆ అతిపెద్ద ద్వీపాన్ని కొనేస్తానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్. అవును.... ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపమైన  గ్రీన్ లాండ్‌పై కన్నేసిన ట్రంప్ ఎంత కావాలో చెప్పండంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు.

అంతర్జాతీయ పెత్తనానికి... సొంత దేశ భద్రతకు వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా మార్చుకోవాలన్న ఆలోచనతో పాటు గ్రీన్‌లాండ్‌లో ఉన్న అపారమైన సహజ వనరుల కోసం ట్రంప్ దాన్ని అమెరికా పరం చేసుకోవాలని ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డెన్మార్క్‌లో ప్రావిన్స్‌‌గా ఉన్న గ్రీన్‌లాండ్‌కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ. విస్తీర్ణం గల గ్రీన్‌లాండ్‌ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచు ఉంది.

గ్రీన్‌లాండ్‌లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. గ్రీన్‌లాండ్‌లో విస్తారమైన హైడ్రోకార్బన్‌ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్‌ బయటపెట్టింది.

1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ గ్రీన్‌లాండ్‌ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్‌ తిరస్కరించింది. ఇప్పుడు కూడా ట్రంప్‌ ప్రతిపాదనకు గ్రీన్‌లాండ్‌ నో చెప్పింది. ఈ విషయమై గ్రీన్‌లాండ్‌ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి మేం సిద్ధంగా లేం.’ అని చెప్పేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English