ప‌వ‌న్ అభిమానుల టార్గెట్ రూ.100 కోట్లు

ప‌వ‌న్ అభిమానుల టార్గెట్ రూ.100 కోట్లు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ అభిమానులు ఒక పెద్ద ల‌క్ష్యం పెట్టుకుని ఆ దిశ‌గా గ‌ట్టి కృషే చేస్తున్నారు. సెప్టెంబ‌రు 2న ప‌వ‌న్ పుట్టిన రోజ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ రోజు నాటిక‌ల్లా రూ.100 కోట్ల విరాళాలు సేక‌రించి జ‌న‌సేనానికి ఇవ్వాల‌ని అభిమానులు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లుగా వార్త‌లొస్తుండ‌టం విశేషం. పుట్టిన రోజుకు నెల ముందు నుంచే ఈ దిశ‌గా స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి.

ప‌వ‌న్ మిగ‌తా రాజ‌కీయ పార్టీల అధినేత‌ల‌తో పోలిస్తే భిన్న‌మైన రాజ‌కీయం చేస్తున్నాడు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలా ప‌డితే అలా డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డం, జ‌నాల‌కు పంచ‌డం లాంటివేమీ చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ పార్టీ న‌డ‌ప‌డానికి డ‌బ్బులు అవ‌స‌ర‌మే. అవి అంత సులువుగా స‌మ‌కూరేలా లేవు.

బిగ్ షాట్స్ భారీగా ఫండింగ్ చేయ‌డానికి ముందుకొచ్చినా.. వారు ఏదో ప్ర‌యోజ‌నాలు ఆశించే ఆ ప‌ని చేస్తున్నారనే ఉద్దేశంతో ప‌వ‌న్ ఎంట‌ర్టైన్ చేయ‌ట్లేద‌న్న‌ది జ‌న‌సేన వ‌ర్గాల స‌మాచారం. సినిమాలు కూడా మానేయ‌డంతో ఆ వైపు నుంచి ఆదాయానికి బ్రేక్ ప‌డింది. ఈ స్థితిలో పవ‌న్ ఇబ్బందిని గ‌మ‌నించి.. అభిమానులే ఆయ‌న‌కు అర్థిక అండ‌దండ‌లు అందించే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన డొనేష‌న్స్ డే అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి విరాళాలు సేక‌రిస్తున్నారు.

అభిమానులు పెద్ద ఎత్తునే స్పందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఐతే కొంద‌రు ఈ అవ‌కాశాన్ని దుర్వినియోగం చేస్తూ విరాళాల్ని త‌మ ఖాతాల్లోకి మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నార‌ట‌. వీరిని అభిమానులు, జ‌న‌సేన ప్ర‌తినిధులు ఓ కంట క‌నిపెట్టాల్సిందే. మ‌రి అభిమానులు తాము పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయి.. సెప్టెంబ‌రు 2న ప‌వ‌న్‌కు వంద కోట్ల విరాళాన్ని బ‌హుమ‌తిగా ఇస్తారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English