ఈ పని ఎప్పుడో చేయాల్సింది జగన్

ఈ పని ఎప్పుడో చేయాల్సింది జగన్

ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పాలన ఏమీ ప్రభావవంతంగా లేదన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. పాలనలో జగన్ తేవాలనుకున్న మార్పులు తెచ్చేందుకు ఇంకా కొంత సమయం అవసరమన్నది అందరికీ తెలిసిందే.. అయితే.. కనీసం, సాధారణ పాలన అయినా సరిగా లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా అధికారులపై మంత్రులకు పట్టులేకపోవడంతో రోజువారీ పాలన గాడి తప్పిందన్నది చాలామంది ఆరోపణ. అంతెందుకు రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు ఊళ్లు మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సరిగా డీల్ చేయలేకపోయిందంటున్నారు.

అదే గత సీఎం చంద్రబాబు తుపాన్లను సైతం సమర్థంగా ఎదుర్కొన్నారని... ఈ ప్రభుత్వం ఉన్నప్పడు హఠాత్తుగా తుపాను వస్తే కొంపలు మునిగిపోతాయని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ తాజాగా వరదలపై స్పందించడంతో వైసీపీ అనుకూల వర్గాలకు డిఫెన్స్ చేసుకోవడానికి పాయింట్ దొరికింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నదికి వరదలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించడంతో.. హమ్మయ్య జగన్ స్పందించారు అనుకుంటున్నారు.

అమెరికా పర్యటనకు వెళ్లేముందు ఆయన వరద పరిస్థితిపై సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎగువ నుంచి 7 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతోందని ముఖ్యమంత్రికి చెప్పారు. వేర్వేరు రిజర్వాయర్ల నుంచి విడుదల అవుతున్న నీటి వివరాలను ముఖ్యమంత్రి ముందు ఉంచారు.

దీంతో సీఎం జగన్ స్పందిస్తూ..కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు వరద ప్రవాహం కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English