ఇలాంటివి జగన్ కు మాత్రమే సాధ్యమేమో?

ఇలాంటివి జగన్ కు మాత్రమే సాధ్యమేమో?

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. అందునా ఏపీలాంటి రాష్ట్రానికి సీఎం అంటే మాటలు కాదు. సైగ చేయటం తర్వాత.. సీఎం బాడీ లాంగ్వేజ్ ను అనుక్షణంగా నిశితంగా గమనిస్తూ.. కోరకుండానే సౌకర్యాల్ని అందుబాటులో ఉంచే ఉద్యోగులు ముఖ్యమంత్రి చుట్టూ ఉంటారు. ఉన్నారు కదా అని వాడేయటం చాలామంది చేసేది. కానీ.. అందుకు తాను పూర్తి భిన్నమన్న విషయాన్ని తాజాగా తన చేతల్లో చూపించి మనసు దోచేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక ముఖ్యమంత్రి ఇంత సింపుల్ గా ఉండటం గతంలో ఎప్పుడూ చూడలేదని.. దేశంలో మరే ముఖ్యమంత్రిలో లేని సింప్లిసిటీ జగన్ సొంతమని చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో చోటు చేసుకున్న ఉదంతమే తాజా వ్యాఖ్యలకు కారణంగా చెప్పాలి.

ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు విశిష్ట సేవా పతకాల్ని అందజేశారు సీఎం. ఆ సందర్భంగా పోలీసు అధికారులకు పతకాల్ని అలంకరించటం మామూలే.
ఇదిలా ఉంటే.. ఓ పోలీసు అధికారికి పతకాన్ని అలంకరించారు.

అనంతరం సదరు అధికారి ముఖ్యమంత్రికి శాల్యుట్ చేసే సమయంలో అ అధికారికి పెట్టిన పతకం జారి కింద పడింది. దీన్ని గమనించకుండానే సదరు అధికారి కవాతు చేసుకుంటూ ముఖ్యమంత్రి ముందు నుంచి వెళ్లిపోయారు. పతకం కిందపడిపోవటాన్ని గుర్తించిన జగన్.. ఆ అధికారి తనను దాటినంతనే కిందకు వంగి పతకాన్ని చేతిలోకి తీసుకున్నారు.  

జారి పడిన పతాకాన్ని మరో అధికారి చేతికి ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి..జారి పడిన పతకాన్ని సైగ చేసి.. ఎవరో అధికారి చేత తీయించొచ్చు. కానీ.. తనకు అలాంటి భేషజాలు ఏమీ లేవన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు జగన్. ఇంత సింఫుల్ గా ఉండటం అందరికి సాధ్యం కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English