'ఆర్టికల్ 370 రద్దు పిటిషన్’ అర్థం కాలేదన్న సుప్రీంకోర్టు!

'ఆర్టికల్ 370 రద్దు పిటిషన్’ అర్థం కాలేదన్న సుప్రీంకోర్టు!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తే ఫలితం తమకు అనుకూలంగా వస్తుందనుకున్నవారికి షాక్ తగిలింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను ఈ ఉదయం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"నేను మీ పిటిషన్ ను అరగంట పాటు చదివాను. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారో తెలియడం లేదు" అని వ్యాఖ్యానించారు. కాగా, సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, ఆర్టికల్ 370 రద్దుపై స్టే ఇవ్వాలని ఆయన కోరారు. కానీ, కోర్టు మాత్రం పిటిషన్ అస్పష్టంగా ఉందని చెప్పింది.

మరో వైపు తమ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నవారు.. ఆశ్రయించినవారి విషయంలో బీజేపీ లైట్‌గానే తీసుకుంటోంది. అన్ని రకాలుగా న్యాయ సంప్రదింపులు జరిపాకే... అన్ని కోణాల్లో జాగ్రత్తలు తీసుకున్నాకే ఈ బిల్లును కేంద్రం రెడీ చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని.. అడ్డగోలుగా విభజిస్తున్నారని.. ఆర్టికల్ 370 రద్దు కూడా రాజ్యాంగ విరుద్ధమని దాన్ని వ్యతిరేకిస్తున్నవారు వాదిస్తున్నారు.

తటస్థ న్యాయ నిపుణులు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి ఏమీ ఇబ్బంది వచ్చేలా లేదని.. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయలేదని.. చాలా తెలివిగా, దాన్ని ఫోర్స్‌లో లేకుండా చేయడానికి అందులోనే ఉన్న క్లాజ్‌ను వాడుకున్నారని చెబుతున్నారు. అందుకే ఆర్టికల్ 370లో ఆ క్లాజ్ తప్ప అన్నీ రద్దు చేస్తూ ఆర్టికల్‌ను సవరించారని చెబుతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English