జగన్ యూఎస్ ట్రిప్ లో ఎక్కడెక్కడకు వెళుతున్నారంటే?

జగన్ యూఎస్ ట్రిప్ లో ఎక్కడెక్కడకు వెళుతున్నారంటే?

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ మధ్యనే ఫారిన్ టూర్ వెళ్లిన ఆయన.. తాజాగా వారంపాటు అమెరికా పర్యటనలో ఉండనున్నారు. పంద్రాగస్టు వేళ నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జగన్.. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లారు. తాజాగా యూఎస్ ట్రిప్ లో జగన్ వారం పాటు టూర్ లో ఉండనున్నారు.

కుటుంబ సభ్యులు కమ్ అధికారులతో కలిసి చేస్తున్న ఈ ట్రిప్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మొత్తం వారం పాటు సాగే టూర్ లో నాలుగురోజులు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా పలువురితో భేటీ కానున్నారు. అదే సమయంలో.. మరో మూడు రోజులు వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండనున్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లిన జగన్.. లోటస్ పాండ్ లోని నివాసానికి వెళ్లి ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు.

అక్కడ నుంచి రాత్రి 9.50 గంటలకు వాషింగ్టన్ కు బయలుదేరి వెళ్లారు.  తాజా యూఎస్ టూర్ కు సంబంధించి ఏపీ సీఎంవో అధికారికంగా టూర్ షెడ్యూల్ ను ప్రకటించింది. దీని ప్రకారం జగన్ అమెరికా టూర్ షెడ్యూల్ ఎలా ఉందంటే..

ఆగస్టు 16
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు వాషింగ్టన్‌ డీసీకి చేరతారు.  
అమెరికా రాయబారితో.. అమెరికా– ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశం.
అమెరికాలోని భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.

ఆగస్టు 17
అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు డల్లాస్‌ చేరుకుంటారు.
సాయంత్రం 6 గంటలకు అక్కడి కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో తెలుగు వారిని కలిసి ప్రసంగిస్తారు

ఆగస్టు 18
వాషింగ్టన్‌ డీసీలో  కొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు
ఆగస్టు 19.. 20.. 21 తేదీల్లో వ్యక్తిగత పనులు

ఆగస్టు 22
మధ్యాహ్నం షికాగోలో  కొందరు వ్యాపార ప్రతినిధులతో భేటీలు.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ఏపీకి తిరుగు ప్రయాణం

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English