ప‌వ‌న్‌.. నీ రాజ‌కీయాలు నిన్నే దిగ‌జారుస్తున్నాయ్‌గా...!

ప‌వ‌న్‌.. నీ రాజ‌కీయాలు నిన్నే దిగ‌జారుస్తున్నాయ్‌గా...!

స‌మాజంలో మార్పు తెస్తాన‌ని, ప్ర‌క్షాళ‌న పూర్వ‌క రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని గొప్ప‌లు పోయిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు త‌న రాజ‌కీయాల‌ను త‌నే దిగ‌జార్చుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌న‌సేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక ప్ర‌సాద్ వివాదంలో చిక్కుకు న్న విష‌యం తెలిసిందే.

పేకాడుతున్న వారిని ఓ పోలీసు అదుపులోకి తీసుకుంటే.. వారిలో త‌న మ‌ద్ద‌తు దారుడు ఉన్నార‌ని, ఆయ‌న‌ను విడిచిపెట్టాల‌ని చేసిన రాపాక ప్ర‌య‌త్నం.. తీవ్ర వివాదం దిశ‌గా దారి మ‌ళ్లింది. ఎస్సై త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా దూషించాడ‌ని,ఆయ‌న అంతు చూస్తాన‌ని నేరుగా త‌న ప‌రివారంతో స్టేష‌న్కు వెళ్లిన రాపాక‌.. అనంత‌రం జ‌రిగిన స్టేష‌న్‌పై దాడి.. వంటివి రాజ‌కీయంగా దుమారం రేపాయి.

ఈ క్ర‌మంలోనే రాపాక‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం, ఆవెంట‌నే ఆయ‌న ప‌రిస్థితిని జ‌ఠిలం చేసు కోవడం ఎందుకులే అనుకుని లొంగిపోవ‌డం తెలిసిందే. అనంత‌రం స్థాని మేజిస్ట్రేట్ జొక్యంతో ఆయన‌కు స్టేష‌న్ బెయిల్ ల‌భించిన విష‌యం కూడా విదిత‌మే.

అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టాల‌ని, వ‌చ్చిన అవ‌కాశం వ‌దులు కోరాద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ భావించి ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తార‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకున్నారు. ఆయ‌న అదేవిధంగా స్పందించారు. అయితే, ఇదే ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయాల్లో ఇంత దిగ‌జారుడు త‌న‌ముందా? అనేలా వ్యాఖ్య‌లు వ‌చ్చేందుకు ఆస్కారం ఇస్తోంది.

రాపాక ఘ‌ట‌న‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును విమ‌ర్శించ‌డం త‌ప్పుకాదు. కానీ, త‌న సొంత పార్టీ ఎమ్మెల్యే ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని వ్యాఖ్యానించ‌డం తాను ఆద‌ర్శవంత‌మైన రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్పు కొని గీసుకున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు విరుద్ధంగానే ఉంద‌ని ప‌వ‌న్‌ను ఉద్దేశించి ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అదే స‌మ‌యంలో త‌న ఎమ్మెల్యేను జ‌గ‌న్ త‌న పార్టీలోకి చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మ‌రో అభాండం వేయ‌డం మ‌రింత హాస్యాస్ప‌దంగా ఉంది. అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌నే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనీ త‌మ పార్టీలోకి తీసుకోవ‌డం జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌ద‌ని వెల్ల‌డించారు. అలా ఎవ‌రైనా గోడ దూకితే.. వెంట‌నే వేటు వేయాల‌ని కూడా స్పీక‌ర్‌కు సూచించారు.

మ‌రి అలాంటి జ‌గ‌న్‌పై ఉద్దేశ పూర్వ‌కంగా ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌వ‌న్ రాజ‌కీయాలు దిగ‌జారాయ‌నే వ్యాఖ్య‌ల‌కు ఆస్కారం క‌ల్పిస్తోంది. ఇక‌, మ‌రో విష‌యం ఏంటంటే.. నిజంగానే రాపాక‌ను పోలీసులు దూషించి ఉంటే.. విష‌యాన్ని స్పీక‌ర్ దృష్టికి తీసుకువెళ్లి స‌భ్యుడిని కించ‌ప‌రిచిన నేరం స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న కింద కేసులు పెట్టి స‌ద‌రు ఎస్సైని ఖ‌చ్చితంగా శిక్షించే అవ‌కాశం వినియోగించుకుని ఉంటే బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏదేమైనా ప‌వ‌న్ ఏదో చిన్న వివాదాన్ని కూడా మ‌సిపూసి.. జ‌గ‌న్ మెడ‌కు క‌ట్టేద్దామ‌ని అనుకుంటే.. త‌న‌కే ఎదురు రావ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు ప‌రిశీల‌కులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English