మరో కొత్త రాష్ట్రం ఏర్పడబోతుందా?

మరో కొత్త రాష్ట్రం ఏర్పడబోతుందా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ఇంకో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దశాబ్దాలుగా వినిపిస్తున్న బుందేల్‌ఖండ్ రాష్ట్ర డిమాండును నెరవేర్చేందుకు మోడీ సర్కారు సుముఖంగా ఉందని చెబుతున్నారు. కశ్మీర్ విభజనను ప్రజలు మర్చిపోయేలా చేసేందుకు కూడా బుందేల్‌ఖండ్ ఏర్పాటు పనిచేస్తుందన్న వాదన ఒకటి వినిపిస్తోంది. కారణాలేవైనా కానీ చిరకాల డిమాండైన బుందేల్ ఖండ్ రాష్ట్ర ఏర్పాటు త్వరలో సాధ్యమవుతుందని దిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

బుందేల్‌ఖండ్ ప్రాంతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఎక్కువ ప్రాంతం మధ్యప్రదేశ్‌లోనే ఉంది. ఇది పీఠభూమి ప్రాంతం, కొండ ప్రాంతం కలగలిపి ఉంటుంది. విస్తారంగా సహజవనరులు ఉన్నప్పటికీ తగిన మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి లేకపోవడంతో బాగా వెనుకబడిన ప్రాంతం ఇది.

ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో ఉన్న బుందేల్ ఖండ్ ప్రాంతం నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. బుందేల్‌ఖండ్‌ రాష్ట్ర డిమాండుపై 1960 నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అయితే రాజకీయంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రభుత్వం దీన్ని తలకెత్తుకుంది. 2011లో నాటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి యూపీని 4 ముక్కలు చేయాలని, అందులో ఒక భాగాన్ని బుం దేల్‌ఖండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దీనిపై యూపీ కేబినెట్‌ తీర్మానంకూడా ఆమోదించింది. యూపీలోని ఏడు జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని ఆరు జిల్లాలను కలిపి బుందేల్‌ఖండ్‌ను ఏర్పరచాలన్నది మాయావతి ప్రతిపాదన. అప్పటికి కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.

బుందేల్‌ఖండ్‌ మొదటి నుంచి కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతం కావడంతో దాన్ని ప్రత్యేక రాష్ర్టంగా చేసి అక్కడ పాగా వేయాలని.. కాంగ్రెస్‌కు పట్టున్న బుందేల్ ఖండ్‌ జిల్లాలను మధ్యప్రదేశ్ నుంచి వేరుచేస్తే ఆ రాష్ట్రాన్నికూడా బీజేపీ కంచుకోటగా మార్చేయొచ్చన్నది మోదీ సర్కారు యోచనగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English