టీఆర్ఎస్ బిగ్ వికెట్ డౌన్‌.... బీజేపీ దారిలోనేనా...!

టీఆర్ఎస్ బిగ్ వికెట్ డౌన్‌.... బీజేపీ దారిలోనేనా...!

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో క‌మ‌ల‌ద‌ళం దూసుకొస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని భ‌ర్తీ చేసి, అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌న్న ల‌క్ష్యంతో క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మ‌లో కాంగ్రెస్‌, టీడీపీల నుంచేగాక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ప‌లువురు కీల‌క నేత‌ల‌ను లాగుతోంది.

ఇందులోప్ర‌ధానంగా ద‌ళిత‌వ‌ర్గాల్లోనే కీల‌క నేత‌ల‌ను పార్టీలోకి తీసుకునేందుకు ప్ర‌త్యేక వ్యూహం అమ‌లు చేస్తోంది. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు, ద‌ళిత‌వ‌ర్గాల‌కు మ‌ధ్య కొంత గ్యాప్ ఉంది. దానిని ఆస‌రాగా చేసుకుని టీఆర్ఎస్‌ను దెబ్బ‌కొట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే.. ఇటీవ‌ల టీఆర్ఎస్ నేత‌, మాజీ ఎంపీ జీ వివేక్‌ను పార్టీలోకి తీసుకుంది.

దీంతో ఉమ్మ‌డి క‌రీంనగ‌ర్ జిల్లాలో బీజేపీ మ‌రింత‌బ‌ల‌ప‌డే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే క‌రీంన‌గ‌ర్ ఎంపీగా బీజేపీ నేత బండి సంజ‌య్ ప్ర‌జ‌ల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. వివేక్ రాక‌తో మ‌రింత బ‌లం చేకూరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు కూడా రేపోమాపో బీజేపీలో చేరడం ఖాయంగానే క‌నిపిస్తోంది. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న ఏపార్టీలోనూ చేర‌లేదు. ద‌ళిత‌వ‌ర్గాల్లో మంచిప‌ట్టున్న నేత‌. ఆయ‌న‌ను స్వ‌యంగా రాష్ట్ర బీజేపీ నేత‌లు ఆహ్వానించారు. ఇదే క్ర‌మంలో ఉమ్మ‌డివ‌రంగ్ జిల్లాలో వ‌ర్ధ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ద‌ళిత‌వ‌ర్గానికి చెందిన కొండేటి శ్రీ‌ధ‌ర్ బీజేపీలో చేరారు.

ఇప్పుడు వీరి దారిలోనే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కీల‌క నేత‌, టీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్న ఎమ్మెల్సీ, మాజీ ఉపముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి కూడా వెళ్తారా..? అనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. నిజానికి.. రెండుమూడు నెల‌ల కింద‌ట‌నే క‌డియం క‌మ‌లం గూటికి వెళ్తున్నార‌నే వార్త‌లు రావ‌డం.. ఆయ‌న వాటిని ఖండించ‌డం జ‌రిగిపోయింది. కానీ.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని కీల‌క ద‌ళిత‌నేతలంద‌రూ క‌మ‌లంగూటికి చేరుతున్న వేళ‌.. క‌డియం కూడా ఏమైనా ఆలోచిస్తున్నారా..? అనే అనుమానాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి.

నిజానికి.. ఆయ‌న చాలాకాలంగా పార్టీలో అంత‌చురుగ్గా ఉండ‌డం లేదు. అందువ‌ల్లే ఈ అనుమానాల‌కు వ‌స్తున్నాయి. ద‌ళివ‌ర్గాల నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో బీజేపీ పెద్ద‌లు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇందుకు బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయ‌ని చెప్పొచ్చు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ ద‌ళిత‌వ‌ర్గాల‌కు అనేక హామీ ఇచ్చారు. ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది ద‌ళితుడినే తెలంగాణ‌కు మొద‌టి ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి అన్నారుగానీ.. అది అంత‌గా అమ‌లుచేసిన దాఖలాలు లేవు. ఈ నేప‌థ్యంలోనే ద‌ళిత‌వ‌ర్గాలు కేసీఆర్‌పై కొంత గుర్రుగా ఉన్నాయి.

దీంతో ఆవ‌ర్గాల‌ నేత‌ల‌ను ద‌గ్గ‌ర చేసుకుని, వారికి కీల‌క ప‌ద‌వులు ఇచ్చి, కేసీఆర్‌ను ఇరుకుపెట్టే వ్యూహంలో భాగంగానే క‌మ‌లం పెద్ద‌లు క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. కొద్దిరోజ‌లుగా క‌మ‌లం పార్టీలో ద‌ళిత‌వ‌ర్గాల నేత‌ల చేరిక జోరందుకుంది. ఇదే దారిలో క‌డియం వెళ్తారో లేదో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English