అవంతీ... కామెడీ మాస్టర్ అయిపోతున్నారే

అవంతీ... కామెడీ మాస్టర్ అయిపోతున్నారే

అవంతి శ్రీనివాస్... ముత్తంశెట్టి శ్రీనివాసరావుగా అసలు పేరు పెట్టుకున్న ఈ  నేత... తన ముద్దు పేరుతోనే ఫేమస్. మొన్నటిదాకా టీడీపీలో కొనసాగి... సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఈ నేత... అధృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలవడం, వైసీపీ అధికారంలోకి రావడం, ఏకంగా జగన్ కేబినెట్ లో మంత్రి పదవి కొట్టేయడం చకచకా జరిగిపోయాయి. తన విషయంలో చకచకా జరిగిపోయిన విషయాలన్నీ వైసీపీ విషయంలోనూ జరిగిపోతాయని నిజంగానే ఆయన కల గంటున్నట్లుగానే ఉంది.

ఎందుకంటే నిన్నటిదాకా టీడీపీ,. ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న అవంతి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నట్లుగానే విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శిష్యరికంలో ఓనమాలు దిద్దిన అవంతి... ఇప్పుడు టీడీపీ డేంజర్ బెల్స్ మోగిస్తుంటే... నిజంగానే ఆయన కామెడీ చేస్తున్నట్లుగానే ఉందన్న మాట వినిపిస్తోంది.

అయినా అవంతి ఇప్పుడు ఏం కామెడీ చేశారన్న విషయానికి వస్తే... టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 10 మంది తనతో టచ్ లో ఉన్నారని, తాము గేట్లు ఎత్తేస్తే.. వారంతా సింగిల్ స్టెప్ లోనే వైసీపీలోకి వచ్చి  చేరతారని ఆయన సంచలన కామెంట్ చేశారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న పది మంది ఎమ్మెల్యేలు తనతో మాత్రమే టచ్ లో ఉన్నారని,. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం... వారంతా వైసీపీలో చేరిపోతారని కూడా అవంతి చెబుతున్నారు. అయినా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా తమ పార్టీలో చోటు లేదని స్వయంగా జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను కూడా మరిచి అవంతి ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారంటే... ఆయన చేసేది కామెడీ కాక మరేమిటన్న వాదన వినిపిస్తోంది.

ఇక టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొత్త వారు లేరాయే. అంతా పార్టీకి కంకణబద్ధులుగా ఉన్న సీనియర్లే. స్వప్రయోజనాల కోసం ఆశించే రకానికి చెందిన నేతలు వీరు కాదు. మరి ఏదో టీడీపీకి ఇప్పుడు దక్కిన పరాజయంతోనే వారు వైసీపీలో చేరతారని, తనతో టచ్ లో ఉన్నారని, జగన్ తలూపడమే ఆలస్యమని అవంతి చేస్తున్ కామెంట్లు కామెడీని పండించేవే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English