శ్రీలక్ష్మీ ఓకే... మరి స్టీఫెన్ పరిస్థితేంటో?

శ్రీలక్ష్మీ ఓకే... మరి స్టీఫెన్ పరిస్థితేంటో?

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నా... అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అధికారుల విషయంలో మాత్రం చాలా కసరత్తే జరిగింది. ఏపీ నేటివిటీ ఉన్నా గానీ... హైదరాబాద్ ను వదిలి ఏపీకి వచ్చేందుకు చాలా మంది అధికారులు సిద్ధపడలేదు. దీంతో ఏపీ నేటివిటీ ఉన్నా కూడా చాలా మంది అధికారులు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఈ తరహా పరిస్థితి నిన్నటిదాకా ఉన్నది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ కేడర్ లో కొనసాగుతున్న ఏపీ నేటివిటీ అధికారులు చాలా మంది ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, వైఎస్ హయాంలో నమోదైన గనుల కుంభకోణంలో ఏకంగా జైలు శిక్ష అనుభవించిన శ్రీలక్ష్మీ ముందు వరుసలో ఉండగా, ఎన్నికలకు ముందు డేటా చోరీ కేసు విచారణలో తనదైన ముద్ర వేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.

వీరిద్దరి సేవలను ఏపీకి బదలాయించేందుకు తెలంగాణ సర్కారు ఓకే అన్నా... అందుకు తగ్గ ఉత్తర్వులు జారీ చేయాల్సిన కేంద్రం మాత్రం ఎందుకనో గానీ... ఈ విషయంపై ఎటూ తేల్చడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీలో పనిచేసే అవకాశం కోసం శ్రీలక్ష్మ తనదైన యత్నాలు చేశారు. వైసీపీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆమె... కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులతో పాటు నేరుగా ప్రధానిని కూడా కలిసినట్లు వార్తలు వినిపించాయి. అయినా కూడా శ్రీలక్ష్మీకి సంబంధించి అనుకూల నిర్ణయం మాత్రం రాలేదు. అయితే పదే పదే అడుగుతున్న శ్రీలక్ష్మీని ఏపీకి బదిలీ చేసేందుకు కేంద్రం ఓకే చెప్పేసింది. శ్రీలక్ష్మీ పెట్టుకున్న దరఖాస్తుకు ఓకే చెప్పేసిన కేంద్రం... ఆమెను ఏపీకి రిలీవ్ చేయాలని తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే... శ్రీలక్ష్మీకి ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్ర విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉమ్మడి ఏపీలోనే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ సమర్ధవంతమైన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్న స్టీఫెన్ ను ఏపీకి తీసుకువచ్చి... రాష్ట్ర ఇంటెలిజెన్స్ పగ్గాలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. స్టీఫెన్ కోసమే తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి 75 రోజులు అవుతున్నా కూడా జగన్ ఆ పోస్టును ఇంకా ఖాళీగానే ఉంచారు. మరి కేంద్రం ఎప్పుడు స్టీఫెన్ బదిలీకి అనుమతిస్తుందో, జగన్ ఎప్పుడు ఇంటిలిజెన్స్ పోస్టును భర్తీ చేస్తారో అన్న దిశగా ఆసక్తికర చర్చలు జరుగుుతన్నాయి. మొత్తంగా శ్రీలక్ష్మీకి ఓకె చెప్పిన కేంద్రం... స్టీఫెన్ ను ఎందుకు వెయిటింగ్ లో ఉంచిందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English