గ్రామ వాలంటీర్లపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

గ్రామ వాలంటీర్లపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇంటికే ప్రభుత్వ పథకాలు అనే థీమ్ తో గ్రామ వలంటీర్ల విధానానికి ముఖ్యమంత్రి జగన్ స్వీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఉండే గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీని ప్రభుత్వం పూర్తి చేసింది.

నియామకాలు పూర్తయ్యాయి, వాలంటీర్లు ఉద్యోగంలో కూడా జాయినైపోయారు. ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను చేరవేసేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థకు గ్రామ వాలంటీర్లు అనుబంధంగా పనిచేస్తారు. ఈ వ్యవస్థలో అవకతవకలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘గ్రామ వాలంటీర్లను ఇష్టానుసారంగా వేసుకుంటున్నారు, వాళ్ల మనుషులను వేసుకుంటున్నారు. నాకు క్షేత్ర స్థాయిలో అన్ని ప్రాంతాల పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను వేసుకుని, వాళ్లకు ఐదువేల రూపాయల జీతాన్ని మాత్రం ప్రజాధనం ఇస్తున్నారు‘‘ అని చంద్రబాబు విమర్శించారు.

అయితే ఈ గ్రామ వాలంటీర్ల విషయంలో అవకతవకలపై టీడీపీ మొదటి నుంచి సాక్ష్యాధారాలతో విమర్శలు చేస్తూనే ఉంది. వలంటీర్ల విధానాన్ని తప్పు పట్టడం లేదు కానీ, వైసీపీ వాళ్లనే తీసుకుంటున్నారని ఆరోపిస్తోంది. ప్రజల్లో కూడా ఈ వాదన బలంగానే వెళ్లినట్టు కనబడుతుంది. అయితే ఈ విమర్శలకు చంద్రబాబు వ్యాఖ్యలు కొనసాగింపు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English