పాకిస్తాన్‌లో కేజీ టమోటా రూ.300.. రూ.500 వైపు పరుగు

పాకిస్తాన్‌లో కేజీ టమోటా రూ.300.. రూ.500 వైపు పరుగు

భారత్‌తో సంబంధాలు తెంచుకున్న ఫలితంగా పాకిస్తాన్ ఇబ్బందులు పడుతోంది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజలు బలవుతున్నారు. ముఖ్యంగా సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి రోజువారీ వంటల్లో ప్రధానమైన టమోటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కేజీ 300 ధర పలుకుతున్న టమోటా మరికొద్ది రోజుల్లోనే కేజీ 500కి చేరొచ్చని చెబుతున్నారు.

ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ భారత్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంది.  వాణిజ్య సంబంధాలను కూడా తెంచేసుకుంది. ఫలితంగా భారత్ నుంచి కూరగాయలు, నిత్యావసరాల సరఫరా నిలిచిపోయింది. ఇమ్రాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆ దేశ ప్రజలకు శాపంగా మారింది. భారత్ నుంచి నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇక, టమాటాల ధర అయితే ఆకాశాన్నంటింది. కిలో టమాటల ధర ఏకంగా రూ.300కు చేరింది. వీటితో పాటు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.

మరో పొరుగు దేశం అఫ్ఘనిస్తాన్ నుంచి టమోటాలను దిగుమతి చేసుకుంటున్నా అవి సరిపోవడం లేదు. కాగా, భారత్‌తో వాణిజ్య పరమైన సంబంధాలు తెంచుకోవడంపై పాక్ వ్యాపారులు అసంతృప్తిగానే ఉన్నా ప్రభుత్వం నిర్ణయం కావడంతో కక్కలేక మింగలేక ఉన్నారు.

మిగతా కూరగాయలు.. ఇతర పప్పు ధాన్యాల ధరలూ పాకిస్తాన్‌లో చుక్కలనంటుతున్నాయి. సాధారణ కూరగాయల ధరలు కూడా భారీగా పెరగడంతో మాంసాహారం ధరనూ స్థానిక వ్యాపారాలు పెంచేస్తుండడంతో నిరుపేదలు తిండికి అల్లాడుతున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English