ఆర్టిక‌ల్ 370 ఎఫెక్ట్‌... టీఆర్ఎస్‌లో టెన్ష‌న్‌

ఆర్టిక‌ల్ 370 ఎఫెక్ట్‌... టీఆర్ఎస్‌లో టెన్ష‌న్‌

జమ్మూక‌శ్మీర్ రాష్ట్ర విభ‌జ‌న ప్ర‌క్రియ‌లో బీజేపీ సార‌థ్యంలోని కేంద్రం దూకుడు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేయ‌నుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 132 మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్న త‌రుణంలో...జ‌రిగిన ఈ ప‌రిణామం గులాబీ పార్టీకి ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డంలో మునుప‌టి త‌ర‌హాలో సుల‌భంగా ఓట్ల‌ను కైవ‌సం చేసుకునే ప్ర‌క్రియ‌కు అడ్డుపుల్ల‌గా మార‌నుంద‌ని చెప్తున్నారు. ఆర్టిక‌ల్ 370, 35ఏకు మ‌ద్ద‌తిచ్చేవారు, వ్య‌తిరేకించే వారి రూపంలో...ఈ స‌మ‌స్య తెర‌మీద‌కు వ‌చ్చిందంటున్నారు.

పార్లమెంట్‌లో కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు చేయటంతో.. ఎక్కడ చూసినా బీజేపీ ఘనతపైనే చర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా యువత, అర్బన్ ఓటర్లలో బీజేపీపై ఫీల్ గుడ్ వాతావరణం క్రియేట్ అయింది. అయితే, ఈ చ‌ర్చ‌ టీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సార్ కార్ పదహారు లోక్ సభ స్థానాలు అనే నినాదంతో.. గులాబీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న మోడీ హవా గులాబీ పార్టీ ఆశలకు గండి కొట్టింది.

తెలంగాణ లోని యూత్, ఉద్యోగులు బీజెపీ వైపు మొగ్గు చూపారు. దీంతో బీజేపీ 4 లోక్ సభ స్థానాల్లో గెలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితనే ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు కనుక మున్సిపల్ ఎన్నికలు వస్తె.. బీజేపీకి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనీ టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.

కాగా, మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై కోర్టులో వాదోప‌వాదాలు సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ చేపడుతున్నారని, చట్ట విరుద్ధంగా జీవోలు జారీచేశారని పేర్కొం టూ.. దాఖలైన పిల్‌లో ప్రభుత్వం కౌంటర్ దాఖలుచేసింది. ప‌ర‌పాల‌క ఎన్నిక‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జూలై 2న మున్సిపాల్టీల పాలకవర్గాల గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నదని, వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English