గులాబీ టీం స్ట్రాంగ్‌గా గురిపెట్టిన లీడ‌ర్ ఎవ‌రు...

గులాబీ టీం స్ట్రాంగ్‌గా గురిపెట్టిన లీడ‌ర్ ఎవ‌రు...

ఏ పోలిటికల్ పార్టీ అయినా..అపోజిషన్ పార్టీని వీక్ చేసి రాజకీయంగా ఎదగాలని చూస్తుంది. అలాగే అపోజిషన్ పార్టీలో బాగా వాయిస్ నేతలనీ టార్గెట్ చేసుకుని వారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా ప్రయత్నిస్తుంది. అదే ఫార్ములాని తెలంగాణలో టీఆర్ఎస్ ఎప్పటినుంచో అనుసరిస్తుంది. 2014లో తెలంగాణ పీఠం కైవసం చేసుకున్న గులాబీ పార్టీ రాజకీయ ప్రత్యర్ధులని తొక్కుకుంటూ పైకి వచ్చేసింది. టీడీపీ నాయకత్వాన్ని మొత్తాన్ని తమ పార్టీలోకి తీసుకుని ఆ పార్టీ అడ్రెస్ గల్లంతు చేశారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కి చుక్కలు చూపిస్తున్నారు.

అలాగే అంతకముందు టీడీపీలో తన గళాన్ని గట్టిగా వినిపించిన రేవంత్ రెడ్డిని ఎలా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చిన వదల్లేదు. కొడంగల్‌లో ఓడిపోయే వరకు నిద్రపోలేదు. ఆ ఎన్నిక‌ల్లో ఒక్క రేవంత్‌రెడ్డి మాత్ర‌మే కాదు... జానారెడ్డి, కోమ‌టిరెడ్డి, డీకే.అరుణ, జీవ‌న్‌రెడ్డి ఇలా ఎంతో మంది కాంగ్రెస్ కీల‌క నేత‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని ఓడిచింది. ఇక రేవంత్ రెడ్డి లాగే తమని ఇబ్బంది పెడుతున్న మరో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని కూడా టీఆర్ఎస్ గట్టిగా టార్గెట్ చేసింది. ఎమ్మెల్యేగా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న జీవన్ రెడ్డిని కేసీఆర్ తనయ కవిత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించే వరకు నిద్రపోలేదు.

మొన్నటివరకు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత..తన పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయేలా చేసింది. అలా అని జీవన్ రెడ్డి తగ్గలేదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలిచి, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు.  అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవితని ఓడించాలని పరోక్షంగా బీజేపీకి కూడా సహకరించారని తెలుస్తోంది. అటు టీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న వినోద్ కూడా కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వినోద్ మద్ధతుతో కవిత జీవన్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేసింది.

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జగిత్యాల స్థానాన్ని టీఆర్ఎస్ ఖాతాలో పడేలా చేసి జీవన్ రెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అటు కేటీఆర్ కూడా దీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెల్లి కవితకి సహకరించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డికి బలంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌ని, టిఆర్ఎస్‌లోకి చేర్చుకున్నారు. కేవలం మున్సిపాలిటీని గెలుచుకోవడమే కాకుండా మంచి వాయిస్ ఉన్న జీవన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. మరి తనని టార్గెట్ చేసుకుని జగిత్యాలలో రాజకీయం చేస్తున్న టీఆర్ఎస్ వ్యూహాలని తిప్పికొట్టి జీవన్ రెడ్డి ఎలా బయటపడతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English