టీడీపీ ఓటమిపై పోస్టుమార్టంలో ఏం తేల్చారు...?

టీడీపీ ఓటమిపై పోస్టుమార్టంలో ఏం తేల్చారు...?

ఇటీవల ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ 175 సీట్లకి గాను కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచింది. అలాగే మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి అధినేత చంద్రబాబు నేతలతో సమావేశాలు నిర్వహిస్తు ఓటమికి గల కారణాలని విశ్లేషుస్తున్నారు. అసలు అన్నీ రకాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేసిన దారుణంగా 23 సీట్లు రావడం ఏంటని ప్రశ్నించుకుంటున్నారు. ఇక మధ్య మధ్యలో నియోజకవర్గాలు వారీగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి నేనేం తప్పు చేశానో చెప్పమంటూ అడుగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో   పూర్తిగా ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం చేసి కొన్ని విషయాలని తేల్చారు. అందులో ముఖ్యంగా సామాజిక సమీకరణలో పార్టీ పూర్తిగా విఫలమైందని అర్ధమైంది. మొదటి నుంచి బీసీల పార్టీగా ఉన్న టీడీపీకి ఈ ఎన్నికల్లో వారే దూరమయ్యారని కొందరు నేతలు అన్నారు. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే వారు వైసీపీకి దగ్గరయ్యారని చెప్పారు.

అలాగే బీసీ సంఘాల్లోని నేతలు చంద్రబాబుని కలిసి తమ సమస్యలు చెప్పుకునే సమయంలో చెలరేగిన గొడవలు కూడా కారణమని తెలుస్తోంది. చంద్రబాబు కూడా వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కూడా తెలిసింది. దీంతో కొన్ని బీసీ కులాలు ఎన్నికల సమయంలో తీర్మానాలు చేసి టీడీపీకి ఓటు వేయకూడదని ఫిక్స్ అయ్యారు. అటు ఎస్సీ వర్గీకరణకి సంబంధించి విషయంలో మాదిగలని పార్టీ దూరం చేసుకుంది.

ఇక ఎన్నికల్లో వైసీపీలా డబ్బు ఖర్చు చేయలేకపోయామని కొందరు సభ్యులు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ తరహాలోనే టీడీపీ పొలిట్‌బ్యూరోని కూడా ప్రక్షాళన చేస్తే బాగుంటుందని ఓ మాజీమంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ఎన్నికల్లో కొందరు నేతలు అతి విశ్వాసం వల్ల ఓడారని, మరికొందరు సరిగా పనిచేయకపోవడం వల్ల ఓడారని నేతలు చంద్రబాబుకు వివరించారు.

ఇదిలా ఉంటే ఈ సమావేశంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఉద్వేగానికి లోనయ్యారు. ఇంత చేసినా ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. అదేవిధంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల మూసివేయడంపై కూడా అయ్యన్న కంటతడి పెడితే ఇతర నాయకులు ఆయనను సముదాయించారని తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికలు ముగిసి రెండు నెలలు దాటాక టీడీపీ ఓటమికి గల కారణాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English