నానీ.. గ‌మ్యం.. క్లారిటీ.. రేపో మాపో.. జంప్ జిలానీ

నానీ.. గ‌మ్యం.. క్లారిటీ.. రేపో మాపో.. జంప్ జిలానీ

ఆయ‌న అత్యంత కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌లో రెండో సారి గెలిచిన ఎంపీ. అయితే, రెండో సారి గెలిచిన ఆనందం ఆయ‌న‌లోనూ, రెండో సారి కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామ‌న్న ఆనందం టీడీపీలోనూ ఎక్క‌డా క‌నిపించ‌క‌పోగా.. అటు ఆయ‌న, ఇటు పార్టీ కూడా ఎడ‌మొహం.. పెడ‌మొహంగానే ఉంటుండ‌డం గ‌మ‌నార్హం.

గెలిచిన రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేశినేని నాని తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ముఖ్యంగా ఆయ‌న సొంత పార్టీపైనే విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, ట్వీట్ల యుద్ధానికి రంగం సిద్ధం చేసుకోవ‌డం వంటివి రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాయి.

దీంతో ఇప్పటి వరకూ అండగా ఉన్న కొందరు నేతలు సైతం ఆయనకు దూరం జరుగుతున్నట్లు తెలుస్తోం ది. ఫ‌లితంగా విజ‌య‌వాడ ఎంపీ నియోజ‌వ‌క‌ర్గం కేడర్‌లో  గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ అభివృద్ధి కంటే ఆధిపత్య పోరుకే ఎంపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
ఎన్నికల్లో గెలవగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని, విజయవాడ వచ్చిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహాన్‌ను ఎంపీ కేశినేని ప్రత్యేకంగా కలవడం ఆ పార్టీలో చర్చనీయాశంగా మారింది.

ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లోక్‌సభలో పార్టీ విప్‌ బాధ్యతలు అప్పగిస్తే తనకు అవసరం లేదంటూ బహిరంగంగానే తృణీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370, 35(ఏ)లను రద్దు చేస్తే దాన్ని లోక్‌సభలోనూ, బయట టీడీపీ సమర్థించింది. అయితే ఎంపీ కేశినేనినాని మాత్రం బయటకొచ్చి వ్యతిరేకించడం కేడర్‌ను గందరగోళంలో పడేసింది.

ఇలా పార్టీ ఎడ్డెం అంటే.. తాను తెడ్డెం అంటూ.. వ్య‌వ‌హ‌రిస్తున్న నాని.. ఇక‌, రేపో మాపో తెలంగాణ‌కు రాబోతున్న బీజేపీ జాతీయ సార‌ధి అమిత్‌తో భేటీ ఇప్ప‌టికే ఖ‌రారైంద‌ని స‌మ‌చారం. ఆయ‌న స‌మ‌క్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇంతోటి దానికి నాని ఇంత హంగామా చేయాలా? అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English