ఆ మంత్రులపై జగన్‌ మరోసారి సీరియస్‌.. తప్పదా...?

ఆ మంత్రులపై జగన్‌ మరోసారి సీరియస్‌.. తప్పదా...?

చెబితే వినడు.. కొడితే ఏడుస్తాడు! అనే సామెత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులకు బాగా అన్వయం అవుతుందని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత జగన్‌ చాలా నిర్ణీత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు నిజాయితీతో కూడిన పాలనను అందించాలని భావించారు.

అదే సమయంలో గత ప్రభుత్వం తాలూకు వాసనలు కూడా రాకూడదని, అంతా పారదర్శకంగా.. జవాబు దారీ తనంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మంత్రులు చాలా అలెర్ట్‌గా ఉండాలని జగన్‌ ఇప్పటికే క్లాస్‌ ఇచ్చారు. ఏమాత్రం తేడా వచ్చినా.. తాను కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

అదే సమయంలో జగన్‌ కొన్ని కీలక సూచనలు చేశారు. మీమీ పేషీల్లో ఉండే అధికారులను కొత్తగా నియమించుకోండి. అది కూడా అవినీతి ఆరోపణలు లేనివారిని నియమించుకుని, నిత్యం ప్రజలకు చేరువ అవండి. గత ప్రభు త్వంలో ఆరోపణలు ఎదుర్కొని, శాఖా పరంగా శిక్షలు అనుభవిస్తున్న, విచారణ ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టాలని కూడా జగన్‌ సూచించారు.

ఈ విషయంలో తాను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తానని, ఏం తేడా వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, నేటికీ కూడా చాలా మంది మంత్రులు తమ తమ పేషీల్లో పాతవారినే కొనసాగిస్తున్నారు. గత చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన వారినే కొనసాగిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్న అజేయ కల్లం.. కూడా మంత్రుల పేషీల్లో కొత్తవారిని నియమించుకోవాలని సూచించారు.

అయినా కూడా కొందరు మంత్రులు మాత్రం ఈ విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితి సంచలనంగా మారింది. తన వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రజలకు చేరువ కావాలని జగన్‌ భావిస్తుంటే.. ఇప్పుడు ఇలా మంత్రులు ఉండడం ఏమేరకు సమంజసమని అంటున్నారు వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు. మరి దీనిపై జగన్‌ మరోసారి సీరియస్‌ అయి.. మంత్రులకు వార్నింగ్‌ ఇచ్చే పరిస్థితి వస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English