జగన్ ప్రభుత్వంపై కుట్ర... మంత్రి వ్యాఖ్యల్లో అంతరార్ధం ఏమిటి...!

జగన్ ప్రభుత్వంపై కుట్ర... మంత్రి వ్యాఖ్యల్లో అంతరార్ధం ఏమిటి...!

ఏపీలో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందా ? ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అంత సీన్ లేదనే చెప్పాలి. ఎందుకంటే బంపర్ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. 175 సీట్లకి 151 గెలుచుకుని తిరుగులేని సీఎంగా జగన్ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే సాధ్యం కానీ పని. అసలు పడగొట్టడం అసాధ్యం. అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరించేందుకు కుట్ర చేస్తున్నారని జగన్ కేబినెట్ లో కీలకంగా ఉండే ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు స్టేట్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి కొడాలి నాని, గురువారం తిరుపతి వచ్చి మొక్కు తీర్చుకున్నాక మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరించేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. మామూలుగా అయితే ఈ వ్యాఖ్యలని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ప్రభుత్వంలో ఉండే మంత్రే ఇలా మాట్లాడటం చూస్తుంటే వెనుక ఏదో జరుగుతుందని తెలుస్తోంది.

పైగా మొన్నటివరకు ఉప్పు-నిప్పుగా ఉన్న బీజేపీ-టీడీపీలు ఇప్పుడు దగ్గరవుతున్నట్లు అనిపిస్తోంది. అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ రకాలుగా తిట్టిన బీజేపీ...ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలెట్టింది. ఒకవైపు విద్యుత్ పి‌పి‌ఏలు, పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో బీజేపీ, జగన్ ప్రభుత్వంపై సీరియస్ గా ఉంది. అటు టీడీపీ కూడా వైసీపీనే విమర్శిస్తుంది తప్ప, గతంలో మాదిరిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనడం లేదు.

ఇక వీరి వాలకం చూస్తుంటే రెండు పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే ఏ రకంగా వీరు వైసీపీని వీక్ చేస్తారు...ఎలా జగన్ కి దెబ్బ వేస్తారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నాని వ్యాఖ్యల్లో అంతరార్ధం కూడా అదే అనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో టీడీపీ-బీజేపీలు కలిసి ఏ విధంగా వైసీపీని దెబ్బ కొడతారు, దాన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది ? అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English