కాంగ్రెస్‌కు వీహెచ్ మైండ్ బ్లాక్ అయ్యే షాక్‌?

కాంగ్రెస్‌కు వీహెచ్ మైండ్ బ్లాక్ అయ్యే షాక్‌?

తెలంగాణ‌లో కాంగ్రెస్‌లో కొన్ని ద‌శాబ్దాలుగా పాత‌కుపోయారు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత వి.హ‌నుమంత‌రావు. నాటి స‌మైక్య రాష్ట్రంలో రాజశేఖ‌ర్‌రెడ్డి లాంటి దిగ్గ‌జ ముఖ్య‌మంత్రులు ఉన్నా వారిపై సైతం ఎప్పుడూ ఏదో ఒక విమ‌ర్శ చేస్తూ సోనియ‌మ్మ భ‌క్తుడిగా కాలం గ‌డిపేశారు. అందుకే ఆయ‌న ఏకంగా మూడుసార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడు అయ్యారు. నిజానికి ఆయ‌న‌కు వ‌చ్చినంత అదృష్టం ఆయ‌న రేంజ్ నేత‌ల‌కు ఎవ్వ‌రికి రాలేదు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం అవ‌సాన ద‌శ‌లో ఉన్న టీ కాంగ్రెస్‌పై వీహెచ్ ఫైర్ అయ్యారు.

టీ కాంగ్రెస్ నేత‌లంద‌రిని ఎడాపెడా వాయించేశారు. ఇక టీ కాంగ్రెస్‌లో ఎవ‌రు ఎవ‌రిని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. అక్క‌డ ప‌రిస్థితి ఇలా ఉంటే వీహెచ్ త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెగ బాధ‌ప‌డిపోతున్నారు. పార్టీలో త‌న‌కు ప్ర‌యార్టీ ఉండ‌డం లేద‌ని... రాజీవ్ జ‌యంతి త‌ర్వాత త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని కూడా త‌న మ‌న‌స్సులో మాట బ‌య‌ట‌పెట్టారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల‌పై తీవ్ర‌మైన అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తాన‌ని చెప్పాన‌ని... అయితే వీళ్లు మాత్రం త‌న పేరు లేకుండానే హైక‌మాండ్‌కు లిస్టు పంపార‌ని వాపోయారు. రాజీవ్ గాంధీ అభిమానుల‌ను తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌న్న వీహెచ్ ఆయ‌న జ‌యంతి త‌ర్వాత త‌న భ‌విష్య‌త్ గురించి క్లారిటీ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే టీ కాంగ్రెస్‌లో కోమ‌టిరెడ్డి సోద‌రుల లాంటి వాళ్లే ఎప్పుడు గోడ దూకుదామా ? అని కాచుకుని కూర్చొని ఉన్నారు.

ఇక ఇప్పుడు హైక‌మాండ్‌కు వీర విధేయుడు, సోనియ‌మ్మ భ‌క్తుడు అయిన వీహెచ్ లాంటి నేతే రాజీవ్ జ‌యంతి త‌ర్వాత నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తే టీ కాంగ్రెస్ ప‌గ్గాలు మోస్తోన్న వారే ఆ పార్టీ ఫ్యూచ‌ర్‌పై డైల‌మాలో ఉన్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. వీహెచ్ ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం మాత్రం రేపుతోంది. వీహెచ్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీ మారినా కేసీఆర్ త‌ప్పా... బీజేపీలో ఆయ‌న్ను ప‌ట్టించుకుంటారా ? అన్న‌ది సందేహ‌మే. ఆయ‌న మ‌దిలో ఏముంది అన్న‌ది క‌రెక్టుగా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English