కియా తొలి కారుపై వైసీపీ ఎంపీ వివాదాస్పద సంతకం

కియా తొలి కారుపై వైసీపీ ఎంపీ వివాదాస్పద సంతకం

కియో తొలి కారు ఆవిష్కరణ కార్యక్రమలో స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కియా ఎండీ, దక్షిణ కొరియా రాయబారి, రాష్ట్ర మంత్రులు హాజరైన ఈ కార్యక్రమంలో కియా ప్రతినిధులకు ఎంపీ స్థాయి వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. పైగా ఆయన తన ఆగ్రహాన్ని కొత్తగా ఆవిష్కరించిన తొలి కారు మీద లిఖిత పూర్వకంగా రాయడంతో జగన్ ప్రభుత్వం ఇరుకున పడింది.

ఇంతకీ ఏం జరిగిందంటే... కియా తొలికారు నిన్న మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రులు, కియా ప్రతినిధులు, దక్షిణ కొరియా రాయబారి హాజరయ్యారు. ప్రొటోకాల్ పరంగా స్థానిక ఎంపీని వేదిక మీదకు పిలవాల్సి ఉంది. కానీ అధికారుల తప్పిదం వల్లనో, ఇంకే కారణమో గాని ఎంపీ గోరంట్ల మాధవ్ ను వేదిక మీదకు ఆహ్వానించలేదు. ఇది ఆయన అవమానంగా ఫీలయ్యారు. కాసేపు మౌనంగా భరించి కారు మీద సంతకాలు చేసే క్రమంలో కియా ప్రతినిధిని పిలిచి పరుష వ్యాఖ్యలు చేశారు.

"స్థానికులకు అన్యాయం జరుగుతోంది. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. సందర్శనకు కూడా అనుమతి ఇవ్వడం లేదు, ముఖ్యమంత్రికి చెప్పి మీ మెడలు వంచుతాం" అన్నట్లు తెలుస్తోంది. తొలికారుపై సంతకాలు చేసే క్రమంలో మిగతా మంత్రులు, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా శుభాకాంక్షలు తెలుపుతూ సంతకం చేయగా... మాధవ్ మాత్రం నిరసన వ్యాఖ్యలు రాశారు. "కియా కార్ రోల్ అవుట్..బట్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ ఈజ్ రూల్డ్ అవుట్" అని రాసి సంతకం పెట్టారు.

మాధవ్ కామెంట్ ను చూసి సంస్థ ప్రతినిధులు విస్మయానికి గురయ్యారు. వైసీపీ మంత్రులే షాక్ తిన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇపుడు అంతర్జాతీయ మీడియా ఫొటోలు తీసుకుంది. అది ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తాజా సమాచార ఏంటంటే... ఈ విషయం ముఖ్యమంత్రి పేషీకి చేరింది. మాధవ్ కు చీవాట్లు తప్పవు.
ఇది అంతర్జాతీయ మీడియా హాజరైన కార్యక్రమం. ఈ సందర్భంలో మాధవ్ వ్యవహారం రాష్ట్రంపై పెట్టుబడిదారులకు అనుమానాలను, భయాలను కలిగించే విధంగా ఉంది. కేంద్రం ప్రభుత్వం కూడా దీనిపై స్పందించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జగన్ ఎంపీ మాధవ్ పై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English