అమెరికా చేసిందే నేనూ చేశాను - జగన్

అమెరికా చేసిందే నేనూ చేశాను - జగన్

అమెరికా విధానాలకు తన విధానాలకు ముడి పెడుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 శాతం ఉద్యోగాలకు సంబంధించి తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని గేట్‌వే హోటల్లో 'డిప్లోమాటిక్ ఔట్‌రీచ్' పేరిట నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జగన్ దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన తన నిర్ణయంపై వెనక్కు తగ్గబోవడం లేదని మరోసారి కుండబద్ధలు కొట్టేశారు.

రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికులకు అత్యధిక ఉద్యోగాలు కల్పించాల్సిందే అని స్పస్టంగా పెట్టుబడిదారులతోనే చెప్పేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య బాగా పెరిగిందని, అందుకే అమెరికా వంటి దేశాలు కూడా ‘స్థానికత‘కు ప్రాధాన్యం ఇస్తున్నాయని గుర్తుచేసిన జగన్ మనమూ అదే బాటలో నడుద్దాం అని అన్నారు.  

75 స్థానిక రిజర్వేషన్ల విషయమై జగన్ మరో లాజిక్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం శాంతి భద్రతలను కాపాడుతుందన్నారు. "పరిశ్రమల ఏర్పాటు వల్ల కాలుష్యం ఏర్పడుతుందని.. అది స్థానికంగా నిరసనలకు, ఆందోళనలకు దారితీస్తుందని, తమ ప్రాంతంలో వచ్చే పరిశ్రమల వల్ల స్థానికులకు ఏదో ఒక లబ్ది లేదా ఉపాధి చేకూరితే... వాళ్లు శాంతియుతంగా సహకరిస్తారని, ఇది శాంతి భద్రతల సమస్య లేకుండా, నిరసనలు, ధర్నాలు లేకుండా వేగంగా ప్రశాంతంగా పరిశ్రమలు నెలకొల్పుకునే అవకాశం కల్పిస్తుంది" అని ముఖ్యమంత్రి అన్నారు. తమకు కొంచెం నష్టం వాటిల్లినా ఉద్యోగం రూపంలో వారికి భరోసా కల్పిస్తే పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ఒకవేళ... కంపెనీలకు అవసరమైన స్కిల్స్ విషయంలో కంపెనీకి అనుమానాలు ఉంటే ఎలాంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో కోరుకుంటున్నారో ప్రభుత్వానికి చెబితే... స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చి... నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను సిద్ధం చేస్తామని జగన్ వెల్లడించరాు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English