చెలరేగిపోతున్న ఇమ్రాన్ కు షాకిచ్చిన అమెరికా

చెలరేగిపోతున్న ఇమ్రాన్ కు షాకిచ్చిన అమెరికా

కశ్మీర్ అంశంపై గడిచిన మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. రాజ్యసభలోనూ.. తర్వాత లోక్ సభలోనూ బిల్లుకు ఆమోదముద్ర పడి.. జమ్ముకశ్మీర్ రాష్ట్రం భారత్ లోని మిగిలిన రాష్ట్రాల మాదిరి మారిపోయిన వేళ.. వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలపై పాకిస్థాన్ ఒక పట్టాన జీర్ణించుకోలేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు నిర్ణయాలపై దాయాది దేశం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంది.

ఈ నిర్ణయాల్లో భాగంగా భారత్ తో వాణిజ్యం రద్దు.. దౌత్య సంబంధాల్ని కనిష్ఠ స్థాయికి చేర్చుకోవటంతో పాటు.. హౌకమిషనర్ అజయ్ బిసారియా బహిష్కరణ లాంటి అంశాలపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పాకిస్థాన్ కు మొట్టికాయలు వేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ అత్యుత్సాహానికి బ్రేకులు వేసేలా ఉన్న ఈ వ్యాఖ్యల ప్రకారం.. తాము అన్ని పరిణామాల్ని చూస్తున్నామని చెప్పటమే కాదు.. పాకిస్థాన్ తన దూకుడును తగ్గించుకోవాలని చెప్పటం గమనార్హం.

పాకిస్థాన్ తన దూకుడును తగ్గించుకోవాలని.. ఎల్ ఓసీ లో అక్రమ చొరబాట్లకు మద్దతు ఇవ్వటం ఆపేయాలని.. పాకిస్థాన్ గడ్డ మీద ఉగ్రమూలాలపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా తేల్చి చెప్పింది. ఇరు దేశాల వైఖరిని తాము గమనిస్తున్నట్లు పేర్కింది. జమ్ముకశ్మీర్ లో పాలన.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ తీసుకున్న భారత్ ప్రభుత్వ నిర్నయాల్ని తాము గమనిస్తున్నట్లుగా అమెరికా చెప్పింది. భారత సర్కారు తీసుకున్న నిర్ణయాల్ని గమనిస్తామన్న వ్యాఖ్య మాత్రమే చేసిన అమెరికా.. పాకిస్థాన్ ను మాత్రం దూకుడు తగ్గించుకోవాలని.. ఉగ్రచర్యలకు మద్దతు ఇవ్వకూడదని చెప్పటం చూస్తే.. ఇమ్రాన్ సర్కారుకు అమెరికా మాటలు మింగుడుపడని రీతిలో మారతాయని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English