తమది అక్రమ నిర్మాణమేనని చెప్పిన ఆంధ్రజ్యోతి

 తమది అక్రమ నిర్మాణమేనని చెప్పిన ఆంధ్రజ్యోతి

ఏపీలో తాము నిర్మించిన ఒక భవనం అక్రమ నిర్మాణంగా ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఒప్పుకుంటూ కోర్టుకు ఆ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పాలచర్లగ్రామ పంచాయితీ పరిధిలో ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ఒక భవనాన్ని నిర్మిస్తోంది. ఈ భవనం క్రమబద్దీకరణ కోసం అధికారులకు దరకాస్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టులో జరుగుతున్న వ్యాజ్యంలో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి అనూష తరఫున న్యాయవాదులు తాజాగా తమ వాదనను వినిపించారు.

ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిర్మాణం కోసం అనుమతి తీసుకోకుండానే భవనాన్ని నిర్మించినట్లుగా చెప్పారు. భవనాన్ని కట్టిన తర్వాతే అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లుగా పేర్కొన్నారు. 2018 ఆగస్టు 31 నాటికి నిర్మాణాలు పూర్తి అయిన భవనాలకే బీపీఎస్ వర్తిస్తుందని.. కానీ.. ఈ భవనం మాత్రం 2018 డిసెంబరులో పూర్తి అయినట్లుగా చెప్పారు. డిసెంబరులో పూర్తి అయిన భవన నిర్మాణం ఆగస్టులో ఎలా పూర్తి అయినట్లుగా చెబుతారని ప్రశ్నించారు. పిటిషనర్ వాదనల్ని చూస్తే.. భవనం అక్రమనిర్మాణమని అర్థమవుతుందన్నారు.

ఇదిలా ఉంటే.. భవన క్రమబద్ధీకరణ కోసం తాము పెట్టుకున్న దరఖాస్తును అధికారులు తిరస్కరించినట్లుగా పిటిషనర్ తరఫు న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అదే సమయంలో నిర్మాణాన్ని కూల్చివేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. అయితే.. గతంలోనే ఈ నిర్మాణం కూల్చివేతపై ఇప్పటికే స్టే ఉన్న నేపథ్యంలో మరోసారి స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English