సిఎం పదవిపై హనుమన్న ఆశ

సిఎం పదవిపై హనుమన్న ఆశ

ఇదివరకు ఒకసారి ముఖ్యమంత్రి పదవి దగ్గరదాకా వచ్చి కొన్ని కారణాల వెనక్కి పోయిందన్నారు కాంగ్రెసు సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడైన వి.హనుమంతరావు. అధిష్టానం దగ్గర మంచి పేరున్న హనుమంతరావు మీడియా ఫ్రెండ్లీ పర్సన్‌. మీడియాని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తారనే పేరుంది హనుమంతన్నకి. జగన్‌ని తిట్టడంలో సిద్ధహస్తుడైన హనుమంతరావు, జగన్‌ని తిడుతూనే పాపులర్‌ అవుతున్నారు. అధిష్టానం హనుమంతన్నకి జగన్‌ని తిట్టడమనే పని మాత్రమే అప్పగించిందా? అన్న అనుమానమూ కలుగుతుంది.

రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా లేదని అంటారు హనుమంతరావు గురించి కాంగ్రెసు వారే. కాని హనుమంతన్నకి ముఖ్యమంత్రి పదవిపై ఆశ ఉంది. ఎప్పటికైనా వస్తుందనే ధీమా కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఆశ పడటంలో తప్పులేదు, కాని ఆ ఆశ నెరవేరుతుందన్న నమ్మకం ఆయనకు నిజంగానే ఉందా? అనేది ప్రశ్న ఇక్కడ.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు