వైరల్ జ్యోతిష్యం... యంగ్ టైగర్ కొత్త పార్టీ పెట్టేస్తారట

వైరల్ జ్యోతిష్యం... యంగ్ టైగర్ కొత్త పార్టీ పెట్టేస్తారట

తెలుగు నేల రాజకీయాలు ఎఫ్పటికప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. 1983లో ప్రారంభమైన ఈ కొత్త రాజకీయం మొన్నటి ఎన్నికల్లోనూ కనిపించింది. వచ్చే ఎన్నికల్లోనూ కనిపించడం ఖాయమేనట. అంతేకాదండోయ్... 1983లో దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సృష్టించిన సంచలనం మాదిరే వచ్చే 2023లో ఆయన మనవడు, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా పెను ప్రభంజనానికి తెర తీస్తారట. తాత స్తాపించిన పార్టీ టీడీపీ ఉన్నా కూడా దాని ఛాయలకు కూడా పోకుండా తాత మాదిరే సొంత పార్టీ పెట్టి తెలుగు నేల రాజకీయాల్లో తనదైన శైలి చూపుతారట. అదే జరిగితే ఇంకేం కావాలి? అన్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది.

అయినా తన మానాన తన సినిమాలేవో చేసుకుంటూ వెళుతన్న తారక్... రాజకీయాల్లోకి వస్తారా? అంటే... వచ్చి తీరతారు, కొత్త పార్టీతో సంచలనం రేపడం కూడా ఖాయమే అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అయినా ఈ వేణు స్వామి ఎవరంటారా? జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాల్లో మాదిరి రాజకీయాల్లో రాణించలేరని చాలా కాలం క్రితమే చెప్పి... పీకే ఫ్యాన్స్ చేతిలో ట్రోలింగ్ కు గురైన జ్యోతిష్యుడు గుర్తున్నారా? ఆయనే ఈ వేణు స్వామి. అసలు పవన్ ఎందుకు రాజకీయాల్లో రాణించలేరన్న విషయాన్ని కూడా వేణు స్వామి చాలా స్పష్టంగానే చెప్పినా కూడా పీకే ఫ్యాన్స్ ఆయనను ఓ రేంజిలో వేసుకున్నారు. అయితే వేణు స్వామి చెప్పినట్టుగానే ఇటీవల ముగిసిన ఎన్నికల్లో పవన్ జీరోగానే మిగిలిపోయారు. అలా పవన్ పొలిటికల్ ఫ్యూచర్ ను చాలా కాలం ముందుగానే చెప్పేసిన వేణు స్వామి ఇప్పుడు తారక్ పొలిటికల్ ఫ్యూచర్ గురించి, తెలుగు నేల రాజకీయాల్లో ప్రత్యేకించి ఏపీ రాజకీయాల్లో తారక్ ప్రభంజనం ఎలా ఉంటుంది? అసలు తారక్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంటుంది? అన్న విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

2023లో తారక్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని వేణు స్వామి తేల్చేశారు. అంతేకాకుండా తాత స్థాపించిన పార్టీ టీడీపీ ఉన్నా కూడా తారక్ అందులో చేరరని, అసలు ఆ పార్టీ వైపు తారక్ కన్నెత్తి చూసే ఛాన్స్ కూడా లేదని వేణు స్వామి చెబుతున్నారు. తాత మాదిరే సొంతంగా ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఎన్టీఆర్... ఎన్నికల్లో కూడా తాత మాదిరి ఘన విజయాలను అందుకుంటారని సెలవిచ్చారు. ఈ మాటలకు ముగింపుగా వేణు స్వామి చేసిన ఓ కామెంట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. తారక్ గురించి తాను చెబుతున్న విషయాలు ఇప్పటి గ్రహ స్థితులను బట్టి ఉంటాయని, 2023లో అప్పటి పరిస్థితులు ఏమైనా ప్రభావం చూపితే తాను వేసిన అంచనా కూడా మారే అవకాశం లేదన్న మాట వేణు స్వామి చెప్పారు. చూద్దాం... ఏం జరుగుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English