ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ ఆగిపోయింది

 ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ ఆగిపోయింది

ఆదివారం రాత్రి దాదాపు గంట పాటు ఫేస్ బుక్ పనిచేయలేదు. లాగిన్ కావాలన్నా.. ఏమన్నా పోస్టింగులు చేయాలన్నా సాధ్యంకాలేదు. మెయింటెన్స్ కారణాలతో డౌనైనట్లుగా ఎర్రని అక్షరాలతో మెసేజ్ చూపించింది. యూరప్, అమెరికాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండగా భారత్‌లోనూ చాలామందికి ఇది అనుభవమైంది. ఆగ్నేయాసియా దేశాల్లో చాలాచోట్ల పనిచేయలేదు. కొద్దిమందికి మాత్రం యథావిధిగా పనిచేసింది. ముఖ్యంగా డెస్క్ టాప్ ప్లాట్ ఫాంపై వినియోగించినవారంతా ఇబ్బందులు పడ్డారు.

మొబైల్ ప్లాట్ ఫాంలపై ఫేస్ బుక్ వినియోగించేవారు సాధారణంగా లాగిన్ అయ్యే ఉంటారు. అలాంటివారు పెద్దగా ఇబ్బందులు పడనప్పటికీ లాగిన్ కావాలని ప్రయత్నించినవారికి మాత్రం ఎర్రర్ కోడ్ 2 అని... మెయింటెనెన్స్ కారణంగా డౌన్‌లో ఉందని మెసేజ్‌లు స్క్రీన్‌పై కనిపించాయి.

భారత్‌లో ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఇది పనిచేయలేదు. దక్షిణ భారత వినియోగదారులు ఈ సమస్యను పెద్దగా ఎదుర్కొన్నట్లు కనిపించలేదు. ట్విటర్‌లో దీనిపై వచ్చిన ట్వీట్లన్నీ ఎక్కువగా ఉత్తరభారతం నుంచే వచ్చాయి.

యూరప్ దేశాల్లో ఫేస్ బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ కూడా స్తంభించింది. అయితే.. భారత్‌లోని ఇన్‌స్టా యూజర్లు మాత్రందీనిపై ఎలాంటి కంప్లయింట్ చేయలేదు. ఫేస్ బుక్ పనిచేయకపోవడంతో ఆ విషయం షేర్ చేస్తూ.. తమ అనుభవాలు పంచుకుంటూ ట్విటర్‌లో నెటిజన్లు హడావుడి చేశారు. దీంతో ట్విటర్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English