మరో కొత్త రాష్ట్రం ఏర్పడనుందా?

మరో కొత్త రాష్ట్రం ఏర్పడనుందా?

సువిశాల భారతదేశంలో మరో కొత్త రాష్ట్రం ఏర్పడనుందా... 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పుడు 30వ రాష్ట్రంగా మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా ? ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలీస్తుందా ? అంటే జాతీయ రాజకీయ వర్గాల్లో అవుననే ఆన్స‌ర్ వినిపిస్తోంది. దశాబ్దాలుగా బుందేల్‌ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై ఎన్డీయే ప్రభుత్వం సానుకూల ధ‌క్ప‌థంతో ఉండడంతో భారతదేశంలో సరి కొత్త రాష్ట్రంగా బుందేల్‌ఖండ్ ఏర్పాట‌య్యే ఛాన్సులు ఉన్నాయి. 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఇప్పుడు 30వ రాష్ట్ర ఏర్పాటు అంటే జ‌రిగితే అది బుందేల్ ఖండే కానుంద‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెపుతున్నాయి.

బీజేపీ ముందు నుంచి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సుముఖంగానే ఉంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే ఉత్త‌రాంచ‌ల్, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాట‌య్యాయి. ఇక 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దిగిపోతూ దిగిపోతూ స‌మైక్య ఆంధ్ర‌ప్రదేశ్ నుంచి తెలంగాణ‌ను విభ‌జించి ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత దేశంలో మ‌రో కొత్త రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఇక ఇప్పుడు బుందేల్‌ఖండ్ రాష్ట్ర డిమాండ్‌పై ప్ర‌మ‌ఖంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

బుందేల్‌ఖండ్ రాష్ట్రం ఎక్క‌డ‌...
బుందేల్‌ఖండ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ప్రాంతం అంతా కొండ‌లు, కోన‌లు, లోయ‌లతో విస్త‌రించి ఉంటుంది. ఉత్త‌ర‌, మ‌ధ్య భార‌తాల్లో ఇది విస్త‌రించి ఉంది. విస్తారంగా సహజవనరులు ఉన్నప్పటికీ తగిన మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి లేక ఈ ప్రాంతం బాగా వెన‌క‌ప‌డిపోయింది. బుందేల్‌ఖండ్‌కు ప్రాచీన చ‌రిత్ర ఉంది. గ‌తంలో ఇదో రాజ్యంగా ఉండేది. బ్రిటీష్ యుద్ధాల్లో కూడా చాలా మంది ఇక్క‌డ నుంచి యుద్ధం చేసేవారు. కొండ‌, కోన‌లు ఎక్కువుగా ఉండ‌డంతో బ్రిటీష‌ర్లు ఇక్క‌డ‌కు వ‌చ్చే సాహ‌సం చేయ‌లేక‌పోయేవారు.

ఈ ప్రాంతం రెండు రాష్ట్రాల్లో విస్తరించింది. మధ్యప్రదేశ్‌లో ఎక్కువగాను, యూపీలో తక్కువగానూ ఉంది. ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం 1960 నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎలా ఉద్య‌మాలు చేసిందో మాయ‌వ‌తి నేతృత్వంలోని బీఎస్పీ కూడా ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్య‌మాన్ని బాగా హైలెట్ చేసింది. 2011లో నాటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి యూపీని 4 ముక్కలు చేయాలని, అందులో ఒక భాగాన్ని బుందేల్‌ఖండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ క్ర‌మంలోనే యూపీలోని ఏడు జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని ఆరు జిల్లాలను కలిపి బుందేల్‌ఖండ్‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర కేబినెట్ కూడా తీర్మానం ఆమోదించింది. అయితే అప్ప‌డు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ స‌ర్కార్ నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో ఈ ప్ర‌తిపాద‌న అట‌కెక్కింది. ఇప్పుడు కొత్త రాష్ట్రం కోసం బుందేలీ సమాజ్‌ కన్వీనరు తారా పాట్కర్ ఆధ్వ‌ర్యంలో ఏకంగా 401 రోజులుగా నిరాహార దీక్ష‌లు న‌డుస్తున్నాయి. ఇక ఇప్పుడు బీజేపీ కూడా ఈ ప్రాంతం త‌మ‌కు అనుకూలంగా ఉంటుంన‌ద్న ఉద్దేశంతోనే కొత్త రాష్ట్ర ఏర్పాటు తెర‌మీద‌కు తెస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English