క్రేజీ లీడ‌ర్ వార‌సుడి పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్‌..!

క్రేజీ లీడ‌ర్ వార‌సుడి పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్‌..!

తండ్రి వార‌స‌త్వాన్ని కొంద‌రు మాత్ర‌మే కొన‌సాగించ‌గ‌లుగుతారు. తండ్రి ఆశ‌యాల‌ను కొంద‌రు మాత్ర‌మే ముందుకు తీసుకుపోగ‌లుగుతారు. కానీ.. మ‌రికొంద‌రు మాత్రం కేవ‌లం తండ్రి చ‌రిష్మాతోనే కాలం వెల్ల‌దీస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ల‌ను ప్ర‌జ‌లు ఎక్కువ‌కాలం మోయ‌లేరు. ఓపిక న‌శించిన త‌ర్వాత‌ నేల‌కేసి కొడుతారు. ఇప్పుడు ఏపీలో ఓ క్రేజీ లీడ‌ర్ వార‌సుడి ప‌రిస్థితి కూడా ఇలాగే త‌యారైంది. తండ్రివార‌సుడిగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి.. ఆ చ‌రిష్మాతోనే ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ.. ఆయ‌న మాత్రం తండ్రిలా ప్ర‌జ‌ల్లో ఉండ‌లేక‌పోయారు. ప్ర‌జ‌ల‌తో క‌లిసి న‌డ‌వ‌లేక‌పోయారు. దీంతో ఇప్పుడు ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్ అయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

అయితే.. ఇంత‌కీ ఆ తండ్రి ఎవ‌రు..? ఆయ‌న వార‌సుడు ఎవ‌రు..? అని ఆలోచిస్తున్నారా.. వారు మ‌రెవ‌రో కాదు.. ప్ర‌ముఖ దివంగ‌త నేత వంగ‌వీటి మోహ‌న‌రంగా, ఆయ‌న త‌న‌యుడు వంగ‌వీటి రాధా. ఇప్పుడు మ‌నం చ‌ర్చించుకునేంది వంగవీటి రాధా పొలిటిక‌ల్ కెరీర్ గురించి. రంగా వార‌సుడిగా రాజ‌కీయాల్లో వ‌చ్చిన రాధా..ఓసారి విజ‌య‌వాడ ఎమ్మెల్యేగా గెలిచాడు.

కానీ.. ఆయ‌న ఆ అవ‌కాశాన్ని నిల‌బెట్టుకోవ‌డం విఫ‌లం చెందారు. ప్ర‌జ‌ల్లో క‌ల‌వ‌లేదు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌లేదు. ప్ర‌జ‌ల‌తో క‌లిసి న‌డ‌వ‌లేదు. దీంతో తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డంలో ఆయ‌న ఘోరంగా విఫ‌లం చెందారు. ఎంత‌సేపూ తండ్రి పేరుతోనే నెట్టుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేశారుగానీ..త‌న‌కంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోలేక‌పోయారు.

2004లో వైఎస్ ప‌ట్టుబ‌ట్టి రాధాను రాజ‌కీయాల్లోకి తీసుకువచ్చి ఎమ్మెల్యేను చేశారు. ఆ త‌ర్వాత వైఎస్ మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా విన‌కుండా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. అక్క‌డ ఓడిపోవ‌డంతో ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లి వ‌రుస‌గా రెండోసారి ఓడారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు ఆయ‌న నుంచి త‌ప్పించేసి మ‌ల్లాది విష్ణుకు ఇవ్వ‌డంతో అలిగిన రాధా టీడీపీలోకి వెళ్లిపోయారు.

ఎన్నిక‌ల‌కు ముందు బాబు ఎంపీ సీటు ఇస్తాన‌న్నా రాధా పోటీ చేయ‌లేదు. టీడీపీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఎమ్మెల్సీ సీటు ఆశించారు. ఇప్పుడు టీడీపీ చిత్తుగా ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా రాధా ప‌రిస్థితి ముందు నుయ్యి... వెన‌క గొయ్యి అయిపోయింది.

ఇక రాధా రాజ‌కీయాల‌ను చూసిచూసి ప్ర‌జ‌ల‌కు ఓపిక న‌శించింది. అంతేగాకుండా.. సొంత సామాజిక‌వ‌ర్గం మ‌ద్ద‌తును కూడా రాధా పొంద‌లేక‌పోతున్నారు అంటే.. ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఎన్నిక‌లకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేర‌డం, త‌న తండ్రి హ‌త్య‌కు టీడీపీ కార‌ణం కాదని అన‌డంతో.. అది మ‌రింత డ్యామేజ్‌గా మారింది.

 అయితే..క‌నీసం టీడీపీ అధికారంలో ఉన్నా..కాస్త‌కూస్తో రాధా హ‌డావుడి క‌నిపించేది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణంగా టీడీపీ ఓడిపోయింది. దీంతో ప‌ద‌వి కోసం మ‌రో ఐదేళ్ల పాటు రాధా వేచి చూడాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక ఇత‌ర పార్టీల్లోకి వెళ్దామ‌న్నా.. దాదాపుగా దారుల‌న్నీ మూసుకుపోయాయి. ఈ నేప‌థ్యంలో సైలెంట్‌గా ఉండ‌డం త‌ప్ప ఆయ‌న చేసేది ఏమీ లేకుండా పోయింది. ఈ రాజ‌కీయ సంక్షోభం నుంచి రాధా ఎలా బ‌య‌ట‌ప‌డుతారో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English