వసూళ్ళ కోసమేనా మహానాడు?

వసూళ్ళ కోసమేనా మహానాడు?

తెలుగుదేశం పార్టీ మహానాడు ఎందుకు నిర్వహించిందయ్యా? అంటే దానికి ఓ విచిత్రమైన సమాధానం చెప్పారు మంత్రి టి.జి. వెంకటేష్‌. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈయనగారు సమైక్యవాదినన్న ముద్ర వేసుకుని, తెలంగాణ వాదులపై కస్సుమనడమే పనిగా పెట్టుకున్నారు. అధికారులన్నా పెద్దగా పడదు టిజి వెంకటేష్‌గారికి. వెటకారమే రాజకీయమనే భ్రమలో ఉండేవారిలో టి.జి. వెంకటేష్‌ కూడా ఒకరేమో అనిపిస్తున్నది.

లేదంటే, మహానాడు పెట్టింది పార్టీ ఫండు కోసమేనని చెప్పడమేంటి? మహానాడు పెట్టకపోతే తెలుగుదేశం పార్టీకి ఫండ్స్‌ రావని టిజి వెంకటేష్‌ ఉద్దేశ్యమేమో. ఆయన అలా మనస్ఫూర్తిగా భావిస్తే తప్పులో కాలేసినట్టే. రాజకీయ విమర్శ చేయాలి గనుక, ఫండ్స్‌.. అనగా వసూళ్ళ కోసం మహానాడును తెలుగుదేశం పార్టీ నిర్వహించిందని టి.జి. వెంకటేష్‌ విమర్శించారు. కాంగ్రెసు పార్టీ వారు, అందులోనూ మంత్రులుగా ఉన్నవారో, ముఖ్యమంత్రో, పిసిసి అధ్యక్షుడో ఢల్లీికి వెళితే సూటు కేసులు పట్టుకుని వెళతారనే విమర్శ ఒకటున్నది. వారొకటి అంటే వీరు నాలుగు వడ్డించడమన్న చందాన రాజకీయం మారింది. అంతే తప్ప, మనం మాట్లాడేదాని వల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగమున్నదా అని ఆలోచన వీరికి రాదేమీ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు