జగన్‌పై అలక వహించిన సీనియర్ మంత్రి

జగన్‌పై అలక వహించిన సీనియర్ మంత్రి

ఏపీ సీఎం జగన్‌‌పై ఆయన కేబినెట్లోని ఓ సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. తన తండ్రి వైఎస్ కేబినెట్లో పనిచేసిన ఆయన అప్పట్లో భారీ కుంభకోణంలో చిక్కుకుని బయటపడ్డారు. ఆయన వైసీపీలో చేరిన తరువాత పార్టీలో మంచి ప్రాధాన్యమే ఉండేది. అయితే.. ఇటీవల కాలంలో తనకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారంటూ ఆయన రగిలిపోతున్నారట.

ఉత్తరాంధ్రకు చెందిన ఆ మంత్రి ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సాధిచడంలోనూ కీలక పాత్ర పోషించారు. పైగా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు జగన్ తన మంత్రివర్గంలో కీలక శాఖే ఇచ్చారు. అయినా, ఆయన తనకు ప్రాధాన్యం లేదంటున్నారట.

గ‌త ప్ర‌భుత్వంలో ప్రాజెక్టులు..కాంట్రాక్టులు ప‌రిశీల‌న కోసం సీఎం కేబినెట్ స‌బ్ కమిటీని నియ‌మించారు. రాజ‌ధానికి సంబంధించిన టెండ‌ర్ల‌ను ఆ క‌మిటీ ప‌రిశీలిస్తోంది. ఆ క‌మిటీలో చరిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఎంపీల‌కు అవ‌కాశం ఇచ్చారు. అంతేకానీ.. అందరూ ఊహించినట్లుగా ఈ మంత్రికి అవకాశం ఇవ్వలేదు. అదే విధంగా తాజాగా కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం మీద గ‌త ప్ర‌భుత్వం ఈడ‌బ్ల్యూయ‌స్ కోటాలో కాపుల‌కు ఇచ్చిన అయిదు శాతం రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు చేస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

అయితే, ఈ విష‌యంపై రాజ‌కీయంగా దుమారం చెల‌రే గ‌టంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ అంశం పైన అధ్య‌య‌నానికి అదే విధంగా మంజునాధ క‌మిష‌న్ నివేదిక ప‌రిశీల‌న కోసం ముగ్గురితో కమిటీ వేసారు. అందులో ఉమ్మారెడ్డి వేంక‌టేశ్వ‌ర్లుతో పాటుగా అంబ‌టి రాంబాబు..తొలి సారి మంత్రి అయిన కుర‌సాల క‌న్న‌బాబుకు అవ‌కాశం ఇచ్చారు. పాపం.. అందులోనూ ప్లేస్ దొరుకుతుందనుకున్న సదరు మంత్రికి చాన్సు రాలేదు.

దీంతోపాటు ఆయన రీసెంటుగా న‌లుగురు డిఎస్పీల బదిలీల కోసం సిఫార్సు చేసినా వాటిని ప‌రిగణ‌నలోకి తీసుకోలేద‌ని స‌మాచారం. దీంతో ఆయన అలక వహించారట. జగన్‌కు వ్యతిరేకంగా బయట అక్కడాఇక్కడా వ్యాఖ్యానాలూ చేస్తున్నారని... ఆ సంగతి జగన్ వరకు వెళ్లిందని అందుకనే ఆయన్ను దూరం పెట్టారని వైసీపీ వర్గాల్లో టాక్. మరి.. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English