జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మత పిచ్చోడికి నెటిజన్ల క్లాస్

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మత పిచ్చోడికి నెటిజన్ల క్లాస్

మతాలకు అతీతంగా కొందరు వ్యక్తుల్లో మత పిచ్చి పెరుగుతోంది. తాము ఎక్కాల్సిన క్యాబ్ డ్రైవర్‌ది ఏ మతం.. తాము ఆర్డర్ చేసిన ఫుడ్ తెచ్చే డెలివరీ బాయ్‌ది  మతం అని చూస్తూ అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి పనే చేశాడు. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాక.. ఆ ఆర్డరును తెస్తున్న వ్యక్తి ఓ ముస్లిం అని గుర్తించి వేరే డెలివరీ బాయ్‌ను పంపించాలంటూ యాగీ చేశాడు. ఆ అవకాశం లేకపోవడంతో ఏకంగా తన ఆర్డరునే క్యాన్సిల్ చేసుకున్నాడు.

దిల్లీకి చెందిన అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. జొమాటో ఆ ఫుడ్ తీసుకెళ్లడానికి ఓ వ్యక్తిని అసైన్ చేసింది. ఆ వ్యక్తి హిందువు కాదంటూ డెలివరీ బాయ్‌ను మార్చాలని కోరాడు అమిత్. అది సాధ్యం కాదని.. ఆ కారణంతో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ కూడా రాదని జొమాటో చెప్పింది. దాంతో తనకు రిఫండ్ కూడా అక్కర్లేదు, క్యాన్సిల్ చేసుకోమని చెప్పేశానంటూ అమిత్ ట్విటర్లో ఆ ఘనకార్యాన్ని పోస్ట్ చేశాడు.

అమిత్ ట్వీట్‌కు జొమాటో ట్విటర్ వేదికగానే సమాధానం చెప్పింది. ఫుడ్‌కి మతం ఉండదని.. ఫుడ్డే ఒక మతమని పేర్కొంటూ అమిత్ ట్వీట్‌‌కి సమాధానం ఇచ్చింది.

మరోవైపు అమిత్ చేసిన ట్వీట్ పట్ల జనం స్పందించారు. అమిత్ తీరును తప్పు పట్టారు. దీనిపై  ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురాం రాజన్ కూడా దానికి రిప్లయ్ ఇచ్చారు. ‘నువ్వు వాడే పెట్రోలు ముస్లిం దేశాల నుంచి వస్తుంది.. కాబట్టి ఇక సైకిల్ తొక్కు’ అంటూ రఘురాం రాజన్ ట్వీట్ చేశారు.

ఇంకొందరు.. నువ్వు తినే తిండి ఇక నుంచి హిందువులే పండించారో లేదో తెలుసుకుని తిను అంటూ గడ్డి పెట్టారు. నడిరోడ్డు మీద నిన్ను ఏ లారీయో గుద్దేస్తే అప్పుడు నిన్ను రక్షించడానికి వచ్చినవాడిని కూడా నీదే మతం అని అడుగుతావా అంటూ మరికొందరు దుమ్ముదులిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English