Gulte bulletin: స్టేట్ అప్ డేట్స్ విత్ వన్ క్లిక్

Gulte bulletin: స్టేట్ అప్ డేట్స్ విత్ వన్ క్లిక్

* ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించిన తెలంగాణ బిల్లును కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రయత్నాలలో ఉంది. దీనిని అడ్డుకునేందుకు సీమాంధ్ర వారు, ఆమోదింపజేసుకునేందుకు తెలంగాణ వారు పార్లమెంటులో స్పీకర్ పోడియం చుట్టుముట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే ఆ పార్టీ అధిష్టానం మాట వినడం లేదు. ఆ పార్టీ ఎంపీలను కట్టడి చేస్తేనే సభలో తెలంగాణ బిల్లు పాసయ్యేందుకు బీజేపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.

* తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు తమ వద్ద అస్త్రాలు చాలా ఉన్నాయని, అవసరం అనుకున్నప్పుడు బహ్మాస్త్రం కూడా ఉపయోగిస్తామని, తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టవద్దని ముఖ్యమంత్రి కిరణ్ తో కలిసి రాష్ట్రపతిని కలిసి కోరతామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.

* ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర షాట్ కొట్టారు. ఒకే మాట - ఒకే బాట అంటూ కడప జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రికి అనుకూలంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన అభిమానులు చేయించారా ? లేక ఆయనే సీమాంధ్ర అంతటా ఇలా చేయిస్తున్నారా ? అన్నది తెలియడం లేదు.

* యూపీఏ ప్రభుత్వం మీద ఈ నెల 5న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, తెలంగాణ బిల్లు మీద బీజేపీ మాట మార్చిన నేపథ్యంలో అసలు బిల్లే పార్లమెంటుకు రాదని భావిస్తున్నామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.

* ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా సీమాంధ్ర నేతలంతా రేపు ఢిల్లీలోని శక్తిస్థల్ లో తెలంగాణ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మౌనదీక్ష చేయనున్నారు. ఈ నెల 5 ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇప్పటికే సీమాంధ్ర నేతలంతా ఢిల్లీకి చేరారు.

* తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఢిల్లీకి చేరింది. ఎయిర్ ఇండియా విమానంలో ఉప కార్యదర్శి లలితాంబిక నేతృత్వంలో ఢిల్లీకి తీసుకోచ్చారు.

* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మీద ఎంపీ సబ్బం హరి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ప్లీనరీలో జగన్ ఉపయోగించిన భాష స్థాయికి తగ్గట్టు లేదని, తన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చిరించారు. సిగ్గులేదా అని జగన్ అంటుంటే ఆ పదమే సిగ్గు పడుతుందని, జగన్ ది లోపల విభజన వాదం ..బయట సమైక్యవాదం అని ఆరోపించారు.

* డీఎంకె పార్టీ ఎంపీ, ఆ పార్టీ అధినేత కుమార్తె కనిమొళి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు.

* కిరణ్, లగడపాటిల వద్ద ఎలాంటి అస్త్రాలు లేవని, రాష్ట్ర విభజన తథ్యమని, ముఖ్యమంత్రి దీక్షలకు, లగడపాటి వేశాలకు తెలంగాణ ఆగదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

* వైఎస్ జగన్ నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి అవడం కాదు..అదే నాలుగు నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. సీబీఐ కేసులో అసలు జగన్ ఎందుకు ఎ1 ముద్దాయిగా ఉన్నాడో ? చెప్పాలని ప్రశ్నించారు.

* తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కాంగ్రెస్ నేత అడుసుమిల్లి జయప్రకాష్, బీజేపీ నేత రఘురామకృష్ణం రాజులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మరో పిటీషన్ దాఖలు చేశారని, మొత్తం సుప్రీంలో ఇప్పటి వరకు 7 పిటీషన్లు వేశారని సమాచారం.

* రేపు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరు మీద అన్ని పార్టీలు కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాయని, విభజన బిల్లును అడ్డుకుంటామని తమతో చెప్పారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు.

* తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు, సీమాంధ్ర నేతలు రేపు రాత్రి 7.30 గంటలకు వార్ రూం సమావేశానికి రావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీనికి ముఖ్యమంత్రి హాజరవుతారా ? లేదా ? అన్నది వేచిచూడాలి.

* తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు చిన్న చిన్న అవరోధాలు ఉన్నా పార్లమెంటులో ఆమోదం లభించడం ఖాయం అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన ఈ రోజు రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత అజిత్ సింగ్ ను కలిశారు. ఆయన కేసీఆర్ ను అభినందించారు.

* ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతికి పాల్పడి ఆస్తులు కూడబెట్టారని, ఆయన మీద విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాస్తానని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.

* ఈ నెల 5 నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కమల్‌నాథ్ అన్నారు.

* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో శ్రీకృష్ణ కమిటీ వేశామని, విస్తృతంగా చర్చించామని, ఈ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తేలేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.

* పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తాము కోరుతున్నామని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజన విషయంలో డబల్ గేమ్ ఆడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

* తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టి వెంటనే ఆమోదం పొందేలా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చర్యలు చేపట్టాలని, బిల్లును అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుదాకర్ రెడ్డి అన్నారు.

* ఆరో తేదీ నుంచి సీమాంధ్రకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయనున్నారని ఏపీఎన్జీవోలు ప్రకటించారు. రేపు వారు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

* ఏపీఎన్జీవోలు 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర బంద్ ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులు ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు.

* విభజన బిల్లుతో పాటు రాష్ట్ర నేతలందరూ ఢిల్లీకి చేరారు. ఈరోజు చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులు, విభజన తీరు అసంబద్ధతను వివరించారు. అంతకుముందు ఆయన పలువురు జాతీయ నేతలతో కలిసి దీనిపై చర్చించారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English