పీపీఏల్లో నాడు ఏం జ‌రిగింది..? జ‌గ‌న్‌కు ప్ర‌తిబంధ‌కాలు ఎందుకు?

పీపీఏల్లో నాడు ఏం జ‌రిగింది..?  జ‌గ‌న్‌కు ప్ర‌తిబంధ‌కాలు ఎందుకు?

ఏపీలో రాజ‌కీయాలు చాలా చిత్రంగా మారుతున్నాయి. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విష‌యాలు తిర‌గ‌దోడాల‌న్న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నేడు అనూహ్యంగా మూకుమ్మ‌డి దాడి జ‌రుగుతోంది. దీంతో ఒక్క‌సారిగా అస‌లుదీని వెనుక ఏంజ‌రిగింది? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది. చంద్ర‌బాబు ప‌ద‌వీ కాలంలో కేంద్రం నుంచి కొన్ని ఒప్పందాలు వ‌చ్చాయి. బొగ్గు, జ‌ల ఆధారిత విద్యుత్ వాడ‌కాన్ని త‌గ్గించి, వాటి స్థానంలో ప‌వ‌న‌, సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాల‌ని కేంద్రం ఆదేశించింది. అదే స‌మ‌యంలో వీటి వాడకం క‌నుక పెంచితే.. తాము ప్ర‌త్యేకంగా రాయితీలు ఇచ్చి ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పింది.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌, సౌర విద్యుత్ కొనేందుకు మూడు కంపెనీల‌తో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఒప్పందాల‌కు దిగింది. ఆయా కంపెనీలు మ‌న రాష్ట్రానికి ఈ విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. అయితే, ఇలా చేసుకున్న ఒప్పందాల వెనుక కోట్లు చేతులు మారాయ‌ని, కాంట్రాక్ట‌ర్ల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దోచి పెట్టింద‌ని వైసీపీ ప్ర‌భుత్వం ఆరోపించింది.

ఈ క్ర‌మంలోనే ఆయా పీపీఏ ఒప్పందాల‌ను తిర‌గ‌దోడతామ‌ని, వాటిని పూర్తిస్థాయిలో ఏం జ‌రిగిందో తేలుస్తామ‌ని వ్యాఖ్యానించింది. నిజానికి గ‌త ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డిన‌ప్పుడు ప్ర‌స్తుత ప్ర‌భుత్వం దానిని విచారించి వెలుగులోకి తెచ్చే చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్పుడు ఎవ‌రైనా దానిని స్వాగ‌తించాలి.

అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇలా అని ప్ర‌క‌టించిన వెంట‌నే.. కేంద్రంలోని ప్ర‌భుత్వం వెంట‌నే క‌దిలింది. ఇలా పీపీఏల‌ను పునఃస‌మీక్షించ‌రాదంటూ.. కేంద్ర ఇంధ‌న శాఖ నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. ఇలా పీపీఏల‌ను మ‌రోసారి స‌మీక్షించ‌డం వ‌ల్ల దేశంలోని ప‌లు ప్రాజెక్టుల‌పై ప్రాభావం ప‌డుతుంద‌ని కాబ‌ట్టి ఈ ప్ర‌తిపాద‌నను విర‌మించుకోవాల‌ని నేరుగా సీఎం జ‌గ‌న్‌కే లేఖ వ‌చ్చింది.

అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ దీనిపై ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, దీనిని మ‌రింత సీరియ‌స్‌గా తీసుకున్న కేంద్ర విద్యుత్ శాఖ వెంట‌నే ఈ విష‌యాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారు.

ప్ర‌స్తుతం షా కోర్టులో ఉన్న ఈ విష‌యంపై ఎలాంటి నిర్ణ‌యం వ‌స్తుందో చూడాలి. అయితే, ఇక్క‌డ అంతుచిక్క‌ని ప్ర‌శ్న ఏంటంటే.. గ‌త ప్ర‌భుత్వం అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని, ప్ర‌జాద‌నాన్ని దోచింద‌ని, విచార‌ణ చేయిస్తాన‌ని చెబుతున్న ప్ర‌భుత్వంపై కేంద్రం నుంచి ఒత్తిళ్లు వ‌స్తున్నాయి.

అదే స‌మ‌యంలో రాష్ట్రంలో నిన్న‌టి వ‌ర‌కు కొట్టుకున్న‌తిట్టుకున్న నాయ‌కులు ఒకే తాటిపైకి వ‌చ్చేశారు. సో.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కేంద్రానికి తెలిసే.. పీపీఏల్లో దోపిడీ జ‌రిగింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనిపై జ‌గ‌న్ అనివార్యంగా వెన‌క్కి త‌గ్గ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని కూడా అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English