ఛార్మికి టెంప్టింగ్‌ ఆఫర్స్‌!

 ఛార్మికి టెంప్టింగ్‌ ఆఫర్స్‌!

'ఇస్మార్ట్‌ శంకర్‌'లో పెట్టుబడి పరంగా ఛార్మి షేర్‌ ఎక్కువ లేకపోయినా కానీ ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ వ్యవహారం అంతా తానే చూసుకుంది. మనీ మేనేజ్‌మెంట్‌ అంతా ఛార్మిపైనే పూరి జగన్నాధ్‌ వదిలేయడంతో పారితోషికాల నుంచి బిజినెస్‌ వ్యవహారాల వరకు అన్నీ ఛార్మి చేతుల మీదుగానే నడిచాయి. ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయడానికి ఛార్మి కారణమని పూరీ కూడా అందరితో చెప్పేటంతగా ఆమె అతడిని మెప్పించింది.

ఖర్చులని విపరీతంగా తగ్గించగలిగిన ఛార్మిని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేర్చుకోవడానికి పలు పెద్ద సంస్థలే ముందుకొస్తున్నాయని, ఇందు నిమిత్తం ఆమెకి కోట్లలో పారితోషికం కూడా ఆఫర్‌ చేస్తున్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఫ్లాపుల్లో వున్నపుడు పూరిని నమ్ముకుని వున్న ఛార్మి ఇప్పుడు అతను సక్సెస్‌ అయిన తర్వాత వేరే చోటకి షిఫ్ట్‌ అవుతుందని అనుకోలేం. పూరీ బ్యాక్‌ టు ఫామ్‌ కనుక ఇప్పుడతనికి పలువురి నిర్మాతల నుంచి ఆఫర్లొస్తాయి.

ఎవరు తనతో సినిమా తీసినా కానీ ఛార్మిని అయితే సహ నిర్మాతగా చేర్చుకోవాలని, ఆమె చేతుల మీదుగానే ఖర్చులు జరగాలని పూరి ఖచ్చితంగా చెబుతున్నాడని గుసగుసలున్నాయి. గతంలో ఇదే కారణం మీద నితిన్‌తో పూరి సినిమా ఒకటి కాన్సిల్‌ అయింది. అప్పట్లో ఛార్మికి పెత్తనం ఇవ్వడానికి నిరాకరించిన వారు ఇప్పుడు తమ డబ్బు మీద ఆమె అజమాయిషీని ఆక్షేపిస్తారా అనేది తేలాల్సి వుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English