బాయ్‌కాట్ డియర్ కామ్రేడ్.. ట్రెండింగ్!

బాయ్‌కాట్ డియర్ కామ్రేడ్.. ట్రెండింగ్!

డియర్ కామ్రేడ్ మీద ఎవరికి అంత వ్యతిరేకత ఉంది.. విజయ్ మీద అంత కోపమేంటి.. అతను ఎవరిని అంతగా హర్ట్ చేశాడు అని ఆశ్చర్యం కలుగుతోందా? ఈ బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్నది మనదగ్గర కాదు.. కర్ణాటకలో. విజయ్-రష్మిక కలయికలో తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ తెలుగుతో పాటు ఇంకో మూడు భాషల్లోనూ విడుదలైంది.

కన్నడలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కాకపోతే కన్నడ వెర్షన్‌ కర్ణాటకలో ఎక్కడెక్కడో కొన్ని షోలు మాత్రమే ఇచ్చారు. నామమాత్రంగా రిలీజైంది. తెలుగు వెర్షన్ మాత్రం భారీ స్థాయిలో రిలీజైంది. మల్టీప్లెక్సుల్లో లెక్కకు మిక్కిలి షోలు పడుతున్నాయి. సింగిల్ స్క్రీన్లలోనూ పెద్ద ఎత్తున సినిమాను రిలీజ్ చేశారు. సినిమాను కన్నడలో కూడా రిలీజ్ చేస్తూ ఇంత తక్కువగా థియేటర్లు ఇవ్వడం.. తెలుగు చిత్రానికి అన్నేసి స్క్రీన్లు కేటాయించడం కన్నడిగులకు నచ్చలేదు.

బెంగళూరు, బళ్లారి లాంటి నగరాల్లో ముందు నుంచి తెలుగు సినిమాల హవా నడుస్తోంది. కొన్నిసార్లు తెలుగు సినిమాలకు పోటీగా రిలీజయ్యే కన్నడ సినిమాలకు అక్కడ పరిస్థితి చాలా కష్టంగా ఉంటోంది. తెలుగు సినిమాలు భారీగా వసూళ్లు కొల్లగొడుతుండటం, థియేటర్లను ఆక్రమిస్తుండటంపై కన్నడ ఇండస్ట్రీలో అసహనం ఉంది. కన్నడ జనాలు కూడా బెంగళూరులో తెలుగు సినిమాల ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నాయి.

ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల వల్ల తమ ఇండస్ట్రీనే నాశనం అయిపోతోందని వాటిపై నిషేధం విధించారు. కానీ ‘కేజీఎఫ్’ వేరే భాషల్లోకి డబ్ అయి అక్కడ వసూళ్ల మోత మోగించిన నేపథ్యంలో కన్నడలో డబ్బింగ్ చిత్రాలపై నిషేధం తీసేశారు. దీంతో మన సినిమాలు ఒక్కొక్కటిగా అక్కడికి అనువాదం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘స్టాప్ ది తెలుగు ఇంపోజిషన్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేశారు. ఈ క్రమంలోనే ‘డియర్ కామ్రేడ్’ ఇష్యూ రావడంతో దాని మీద వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English